క‌రోనా వేళ‌..ఆక్సిజన్‌ సిలిండర్ల దందా..టాస్క్ పోర్స్ మెరుపు దాడులు

హైదరాబాద్‌లో అక్రమంగా ఆక్సిజన్‌ సిలిండర్ల అమ్మకాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి.క‌రోనా వీర‌విహారం చేస్తున్న వేళ‌..అత్యంత అవ‌స‌ర‌మైన ఆక్సిజన్‌ సిలిండర్ల దందాకు తెరలేపారు కొంద‌రు.

క‌రోనా వేళ‌..ఆక్సిజన్‌ సిలిండర్ల దందా..టాస్క్ పోర్స్ మెరుపు దాడులు
Follow us

|

Updated on: Jul 12, 2020 | 6:08 PM

హైదరాబాద్‌లో అక్రమంగా ఆక్సిజన్‌ సిలిండర్ల అమ్మకాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి.క‌రోనా వీర‌విహారం చేస్తున్న వేళ‌..అత్యంత అవ‌స‌ర‌మైన ఆక్సిజన్‌ సిలిండర్ల దందాకు తెరలేపారు కొంద‌రు. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ.. ప‌రిస్థితుల్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు నిర్వ‌హించి..కొంద‌ర్ని అరెస్ట్ చేశారు. తాజాగా మ‌రోసారి నగరంలో మరొకసారి ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకున్నారు అధికారులు. ముషీరాబాద్ లో అక్ర‌మంగా దాచి ఉంచిన‌ 34 సిలెండర్లని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా బాబా ట్రేడర్స్ సిలిండర్ విక్రయిస్తున్న‌ట్లు గుర్తించారు. అధిక ధరకు సిలిండర్లను అమ్ముతున్న సర్దార్ ఖాన్ ను అరెస్టు చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉండ‌టంతో బ్లాక్ మార్కెట్ కు తెర‌తీశారు కేటుగాళ్లు. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.