కరోనా కాలంలో.. క్రికెట్ మ్యాచ్‌కు.. అభిమానుల సందడి..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా సంక్షోభంలో సమయంలో.. ఇంగ్లండ్ క్రికెట్‌ సిరీస్‌ను ఆరంభించి ప్రయోగం చేసింది. ఇంగ్లండ్‌లో వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఇప్పటికే ముగింపు దశకు రాగా

కరోనా కాలంలో.. క్రికెట్ మ్యాచ్‌కు.. అభిమానుల సందడి..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 3:42 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా సంక్షోభ సమయంలో.. ఇంగ్లండ్ క్రికెట్‌ సిరీస్‌ను ఆరంభించి ప్రయోగం చేసింది. ఇంగ్లండ్‌లో వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఇప్పటికే ముగింపు దశకు రాగా, దాన్ని బయో సెక్యూర్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వకపోవడం ఒకటైతే, సదరు స్టేడియాలకు అనుసంధానం చేసి ఉన్న హోటళ్లలోనే ఆటగాళ్లను ఉంచి బయో సెక్యూర్‌ విధానంలో సిరీస్‌ను దిగ్విజయంగా ముగించనుంది.

మరోవైపు.. కరోనా వ్యాప్తి దశలో కూడా.. ఇంగ్లండ్‌లో కౌంటీ జట్లైన సర్రే- మిడిల్సెక్స్ మధ్య ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ నిర్వహించారు. దీనికి ప్రేక్షకులకు అనుమతి ఇస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. సౌత్‌ లండన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు కేవలం వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో అభిమానం స్టేడియానికి తరలివచ్చింది. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ కోసం పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చినా అందుకు తాము సిద్ధం అంటూ అభిమానం వెల్లివిరిసింది. ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌ను నిర్వహించడం ఇంగ్లండ్‌లో మార్చి తర్వాత ఇదే ప్రథమం.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!