రైనా లేకపోవడం ధోనీకి మంచి అవకాశం : గంభీర్

ఐపీఎల్ నుంచి సురేశ్ రైనా తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి కలిసొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. బ్యాటింగ్ లైన్ అఫ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు మార్గం సుగమమైందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు.

రైనా లేకపోవడం ధోనీకి మంచి అవకాశం : గంభీర్
Follow us

|

Updated on: Sep 01, 2020 | 5:55 PM

ఐపీఎల్ నుంచి సురేశ్ రైనా తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి కలిసొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. బ్యాటింగ్ లైన్ అఫ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు మార్గం సుగమమైందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. వ్యక్తిగత కారణాలతో రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ధోనీకి ఇప్పుడు నంబర్ 3లో ఆడే అవకాశం దక్కిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ సంవత్సర కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడని, కాబట్టి మూడో ఫ్లేస్ లో దిగితే ఎక్కువ బంతులను ఎదుర్కొనే అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు. ధోనీ మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలడని గంభీర్ అభిప్రాయపడ్డారు.

మ్యాచ్‌ను ముగించేందు చెన్నై సూపర్ కింగ్స్ లో మంచి ఆటగాళ్లు ఉన్నారని, ధోనీ ఫస్ట్ ‌డౌన్‌లోనే రావొచ్చన్నాడు గంభీర్. ధోనీ ఫస్ట్ డౌన్‌లో వస్తే ఆ తర్వాత కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, శామ్ కరన్ వంటి ఆటగాళ్లు మరింత బలంగా మారుతారని అన్నాడు. ధోనీకి ఇది మంచి అవకాశమని, దానిని అతడు ఆస్వాదిస్తాడని తాను భావిస్తున్నట్టు గంభీర్ పేర్కొన్నాడు. సురేశ్ రైనా లేడు కాబట్టి ఆ స్థానంలో అనుభవజ్ఞుడైన ఆటగాడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటాడని, అది ధోనీనే కావచ్చని గంభీర్ తెలిపారు.