హథ్రాస్‌ కేసులో సీబీఐ దర్యాప్తును అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తుంది ః సుప్రీం

హథ్రాస్‌ ఘటనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ జిల్లా బుల్‌గారి గ్రామంలో దళిత అమ్మాయిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై తీవ్రంగా హింసించి ఆమె చావుకు కారకులయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దాఖలైన దరఖాస్తులపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ జరుపుతున్న దర్యాప్తును ఎప్పటికప్పుడు అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీం తెలిపింది. కేసును ఢిల్లీకి బదిలి చేయాలనే అంశాన్ని […]

హథ్రాస్‌ కేసులో సీబీఐ దర్యాప్తును అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తుంది ః సుప్రీం
Follow us

|

Updated on: Oct 27, 2020 | 3:36 PM

హథ్రాస్‌ ఘటనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ జిల్లా బుల్‌గారి గ్రామంలో దళిత అమ్మాయిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై తీవ్రంగా హింసించి ఆమె చావుకు కారకులయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దాఖలైన దరఖాస్తులపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ జరుపుతున్న దర్యాప్తును ఎప్పటికప్పుడు అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీం తెలిపింది. కేసును ఢిల్లీకి బదిలి చేయాలనే అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని తెలిపింది.. సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసిన అనంతరం కేసు బదిలీపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తు వివరాలను అలహాబాద్‌ హైకోర్టుకు అందచేయాల్సి ఉంటుంది.. ఇక ఈ కేసుకు సంబంధించి బాధిత కుటుంబ భద్రతను, సాక్షుల భద్రతను అలహాబాద్‌ హైకోర్టు చూసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక హథ్రాస్‌ కేసుకు సంబంధించిన ఆదేశాలలో బాధితురాలి పేరును తొలగించాలంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న విన్నపాన్ని సుప్రీం మన్నించింది. బాధితురాలి పేరును తొలగించాలని అలహాబాద్‌ హైకోర్టుకు సూచించింది. ఈ నెల 15న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..