పాలిటిక్స్‌పై చిరు సంచలన వ్యాఖ్యలు.. రజనీ, కమల్‌లకు సలహా

టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన స్థానాన్ని ఇప్పటి ఏ హీరోలు భర్తీ చేయలేరన్నది జగమెరిగిన సత్యం. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉండగా.. రాజకీయాలపై తన తోటి హీరోలైన రజనీ కాంత్, కమల్ హాసన్‌లకు చిరు సలహా ఇచ్చారు. కుదిరితే రాజకీయాలకు దూరంగా ఉండండి అంటూ ఆయన సొంత అనుభవాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన […]

పాలిటిక్స్‌పై చిరు సంచలన వ్యాఖ్యలు.. రజనీ, కమల్‌లకు సలహా
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 11:45 AM

టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన స్థానాన్ని ఇప్పటి ఏ హీరోలు భర్తీ చేయలేరన్నది జగమెరిగిన సత్యం. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉండగా.. రాజకీయాలపై తన తోటి హీరోలైన రజనీ కాంత్, కమల్ హాసన్‌లకు చిరు సలహా ఇచ్చారు. కుదిరితే రాజకీయాలకు దూరంగా ఉండండి అంటూ ఆయన సొంత అనుభవాలను వెల్లడించారు.

తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాలను వెల్లడించారు. అందులో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో తాను నంబర్ 1గా కొనసాగుతున్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. డబ్బు వల్లనే నా సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయా. నా తమ్ముడు పవన్ కల్యాణ్‌ కూడా ఇటీవల ఎన్నికల్లో అలానే ఓడిపోయాడు అని చిరు తెలిపారు. పాలిటిక్స్‌లో నిలవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మాత్రం రజనీ కాంత్, కమల్ హాసన్ ఆ సవాళ్లన్నింటిని ఎదుర్కోవల్సి వస్తుంది అని చిరు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్ పార్టీ కొన్ని స్థానాలైనా గెలుస్తుందని భావించానని.. కానీ ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేనిదని తెలిపారు.

కాగా 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరు.. 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పార్టీ 18 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఆ ఎన్నికల్లో తన స్వస్థలం పాలకొల్లు, తిరుపతి నుంచి చిరు పోటీ చేయగా.. ఒక స్థానం నుంచే గెలిచారు. ఇక ఆ తరువాత ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన నటించిన సైరా మరో ఐదు రోజుల్లోకి విడుదలకు సిద్ధమౌతోంది. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. దాదాపు రూ.200కోట్ల వ్యయంతో రామ్ చరణ్ నిర్మించాడు.

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.