Olympics: ఒలింపిక్స్‌పై మీకున్న అవగాహన ఎంత.? ఈ ప్రశ్నలతో తెలుసుకోండి..

|

Jul 26, 2024 | 10:32 AM

ఇదిలా ఉంటే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే ఒలింపిక్స్‌లో జరిగే గేమ్స్‌ పట్ల చాలా మందిలో ఎంతో ఆసక్తి ఉంటుంది. కేవలం ఆటను ఆటగా చూడడమే కాకుండా అందుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనే ఆతృత కూడా ఉంటుంది. అందుకే ఒలింపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలను పోటీ పరీక్షల్లో సైతం అడుగుతుంటారు. మరి ఒలింపిక్స్‌ క్రీడలపై...

Olympics: ఒలింపిక్స్‌పై మీకున్న అవగాహన ఎంత.? ఈ ప్రశ్నలతో తెలుసుకోండి..
Olympics Quiz
Follow us on

ఒలింపిక్స్‌.. యావత్‌ ప్రపంచాన్ని ఉత్కంఠతో బధించే విశ్వక్రీడా పండుగా. ఒలిపింక్స్‌ గేమ్స్‌ వస్తున్నాయంటే చాలు యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. విశ్వవేదికపై తమ దేశపు జెండా ఎగరాలని ప్రతీ పౌరుడు కోరుకుంటారు. ఈ్రమంలోనే ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌ భారతదేశానికి ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. దీనికి కారణం.. ఈసారి ఏకంగా 117 మంది భారతీయ అథ్లెట్‌లు ఒలింపిక్స్‌ బరిలో నిలుస్తున్నారు. దీంతో భారత్‌కు ఎన్ని మెడల్స్‌ వస్తాయన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. భారత్‌ ఈసారి టాప్‌ 30లో నిలవడం ఖాయమని అందరూ ఆశిస్తున్నారు.

ఈసారి 21 మంది షూటింగ్‌లో, హాకీలో 19 మంది పోటీ పడనున్నారు. తర్వాతి స్థానాల్లో ఎనిమిది మందితో టేబుల్‌ టెన్నిస్‌, ఏడుగురు బ్యాడ్మింటన్‌, ఆరుగురు రెజ్లింగ్‌ క్రీడాకారులు, ఆరుగురు ఆర్చరీ, ఆరుగురు బాక్సింగ్‌, నలుగురు గోల్ఫ్‌, ముగ్గురు టెన్నిస్‌, ఇద్దరు స్విమ్మింగ్‌, ఇద్దరు సెయిలింగ్‌ క్రీడలకు ప్రాతినిధ్యం దక్కింది. ఇక, జూడో, రోయింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఈక్వెస్ట్రియన్‌ నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నారు. భారత్ నుండి ఒలింపిక్స్‌కు ఎంపికైన వారిలో పురుష అథ్లెట్లు 70 మంది.. మహిళా ప్లేయర్స్‌ 47 మంది ఉన్నారు. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య పెరగాలని 140 కోట్ల మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత ఒలింపిక్స్‌ల కంటే ఈసారి భారత బృందం పటిష్టంగా ఉంది. కొంత కాలంగా భారత ఆటగాళ్లు అంతర్జాతీయ మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్నారు. దాంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు రావడం ఖాయమనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే ఒలింపిక్స్‌లో జరిగే గేమ్స్‌ పట్ల చాలా మందిలో ఎంతో ఆసక్తి ఉంటుంది. కేవలం ఆటను ఆటగా చూడడమే కాకుండా అందుకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనే ఆతృత కూడా ఉంటుంది. అందుకే ఒలింపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలను పోటీ పరీక్షల్లో సైతం అడుగుతుంటారు. మరి ఒలింపిక్స్‌ క్రీడలపై మీకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోవాలని ఉందా.? అయితే ఓసారి కింద ఇచ్చిన ప్రశ్నలకు మీరు ఏమేర సమాధానం ఇవ్వగలరో ఓసారి చెక్‌ చేసుకోండి..

టేబుల్‌ టెన్నిస్‌..

1) టేబుల్ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ను ఒలింపిక్స్‌లో ఎప్పటి నుంచి ప్రారంభించారు.?
a) బీజింగ్‌ 2008 b) పారిస్‌ c) టోక్యో 2020 d) సియోల్‌ 1988

2) టేబుల్‌ టెన్నిస్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మొట్టమొదటి దేశం ఏది.?
a) ఇండోనేషియా b) డెన్మార్క్‌ c) జపాన్‌ d) చైనా

టెన్నిస్‌..

1) పారిస్‌ 2024లో టెన్నిస్‌ కోసం ఏ రకమైన ఉపరితలం ఉన్న కోర్ట్‌లను ఉపయోగిస్తున్నారు.?
a) కాంక్రీట్‌ b) క్లే c) గ్రాస్‌ d) హార్డ్‌

2) చివరిసారి ఏ ఒలింపిక్స్‌లో టెన్నిస ఈవెంట్‌ కోసం క్లే కోర్ట్‌ను ఉపయోగించారు.?
a) బీజింగ్ 2008 b) బార్సిలోనా 1992 c) లండన్‌ 2021 d) లాస్‌ ఏంజిలెస్‌ 1984

ఫుట్‌బాల్‌కు సంబంధించి..

1) ఒలింపిక్‌ ఫుట్‌బాగ్‌ విభాగంలో అత్యధిక గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన దేశం ఏంటి.?
a) బ్రెజిల్‌ b) అర్జెంటీనా c) గ్రేట్ బ్రిటన్‌ d) అమెరికా

2) ఒలింపిక్స్‌లో ఉమెన్‌ ఫుట్‌బాల్‌ను ఎప్పుడు ప్రారంభించారు.?
a) అట్లాంటా 1996 b) బార్సీలోనా 1992 c) సిడ్నీ 2000 d) అథెన్స్‌ 2004

ఆర్చరీ..

1) ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్స్‌ను ఒలింపిక్స్‌లో ఎప్పుడు ప్రారంభించారు.?

a) లాస్‌ ఏంజిలెస్‌ 1984 b) టోక్యో 2020 c) బీజింగ్‌ 2008 d) రియో 2016

వాలీబాల్‌..

1) వాలీబాల్‌ గేమ్‌లో బాల్‌ గరిష్టంగా ఎంత వేగంతో దూసుకెళ్తుంది.?

a) గంటకు 70 కి.మీల వేగంతో b) గంటకు 130 కి.మీ వేగంతో c) 105 కి.మీల వేగంతో d) 90 కి.మీల వేగంతో

2) మహిళలటు పురుషులటీమ్స్‌ వరసగా మూడు ఒలింపిక్స్‌ టైటిల్స్‌ను గెలుచుకున్న దేశం ఏది.?
1) బ్రెజిల్‌ 2) యునైటెడ్‌ స్టేట్స్‌ 3) క్యూబా 4) సెర్బియా

సమాధానాలు..

టేబుల్ టెన్నిస్‌..
1) c – టోక్యో 2020 2) d-చైనా

టెన్నిస్‌..
1) b- క్లే 2) b- బార్సిలోనా 1992

ఫుట్‌బాల్‌..
1) d- అమెరికా
2) a – అట్లాంటా 1996

ఆర్చరీ..

1) b- ఆర్చరీ

వాలీబాల్‌..

1) b-గంటకు 130 కి.మీల వేగంతో.

2) d- క్యూబా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..