Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పోటీపడే ఆటగాళ్లు వీరే.. అందరి దృష్టి ఆ 10 మందిపైనే.!

|

Jul 26, 2024 | 10:23 AM

పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 69 ఈవెంట్లలో భారతీయులు పోటీపడనున్నారు. ఈ పోటీల్లో దాదాపు 10 పతకాలు రావడం ఖాయం. గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, ఈసారి కూడా వీరి నుంచి మంచి ప్రదర్శనను ఆశించవచ్చు. ఆ పది మంది పోటీదారులు ఎవరు? చూద్దాం.?

Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్ నుంచి పోటీపడే ఆటగాళ్లు వీరే.. అందరి దృష్టి ఆ 10 మందిపైనే.!
Paris Olympics India
Follow us on

పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 69 ఈవెంట్లలో భారతీయులు పోటీపడనున్నారు. ఈ పోటీల్లో దాదాపు 10 పతకాలు రావడం ఖాయం. గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, ఈసారి కూడా వీరి నుంచి మంచి ప్రదర్శనను ఆశించవచ్చు. ఆ పది మంది పోటీదారులు ఎవరు? చూద్దాం.?

2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. కాబట్టి ఈసారి కూడా పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ వైపు నుంచి పతకం ఆశించవచ్చు. ఈసారి మహిళల బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ నుంచి పతకం ఆశించవచ్చు. ఎందుకంటే 50 కేజీల విభాగంలో మహిళల బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఛాంపియన్‌ టైటిల్‌ కూడా కైవసం చేసుకుందీమె. కాబట్టి నిఖత్ నుంచి పతకం కోసం ఎదురుచూడవచ్చు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన లోవ్లినా నుంచి పతకం ఆశించవచ్చు. దీని ప్రకారం ఈసారి మహిళల బాక్సింగ్ విభాగం నుంచి భారత్ రెండు పతకాలు సాధిస్తుందని అంచనా.

2022లో చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట ఈసారి ఒలింపిక్ పతకం గెలుస్తామని నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ జోడీ ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. కాబట్టి ఈ జోడీ నుంచి బ్యాడ్మింటన్‌లో పతకం ఆశించవచ్చు. పివి సింధు ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండు పతకాలు సాధించింది. 2016లో రియోలో రజత పతకం సాధించిన సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాబట్టి ఈసారి కూడా పీవీ సింధు నుంచి పతకం ఆశించవచ్చు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, పాండల్ కూడా పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడుతోంది. కాబట్టి మహిళల రెజ్లింగ్ నుంచి పతకం ఆశించవచ్చు. రోహన్ బోపన్న – ఎన్.శ్రీరామ్ బాలాజీ ల పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. పురుషుల డబుల్స్ పోటీలో కనిపించనున్న ఈ జోడీ నుంచి పతకం ఆశించవచ్చు. 2020 టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 49 కేజీల విభాగంలో పారిస్‌లో పోటీపడనుంది. గతేడాది రజత పతకంతో సంతృప్తి చెందిన చాను నుంచి ఈసారి బంగారు పతకాన్ని ఆశించవచ్చు.

ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా 469.6 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆమె 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన చైనాకు చెందిన జాంగ్ కియోంగ్యును కూడా ఓడించింది. కాబట్టి సిఫ్ట్ కౌర్ సమ్రా నుంచి కూడా పతకం ఆశించవచ్చు. భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా 41 ఏళ్ల పతకాల కరువును అధిగమించింది. ఇప్పుడు అదే స్పూర్తితో ఉన్న టీమ్ ఇండియా స్వర్ణ పతకం కోసం ఎదురుచూడవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..