మా కుటుంబసభ్యుల్ని ఎందుకు చంపుతున్నారు – సురైష్ రైనా సంచలన ప్రకటన

ప్రముఖ టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి తప్పుకుని ఒక సంచలనమే క్రియేట్ చేసిన ఈ యంగ్ క్రికెటర్ ఇప్పుడు...

మా కుటుంబసభ్యుల్ని ఎందుకు చంపుతున్నారు - సురైష్ రైనా సంచలన ప్రకటన

Updated on: Sep 01, 2020 | 1:26 PM

ప్రముఖ టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి తప్పుకుని ఒక సంచలనమే క్రియేట్ చేసిన ఈ యంగ్ క్రికెటర్ ఇప్పుడు తన కుటుంబసభ్యుల్ని ఎందుకు చంపుతున్నారంటూ ప్రశ్నల తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘పంజాబ్‌లో మా బంధువులు భయంకర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. మా అంకుల్‌ని నరికి చంపేశారు. మా ఆంటీతో పాటు ఇద్దరు కజిన్‌లను తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతూ దురదృష్టవశాత్తు మా కజిన్ గత రాత్రి మృతి చెందారు. మా ఆంటీ పరిస్థితి కూడా విషమంగా ఉంది’ అని సురేశ్ రైనా ఒక ట్వీట్ లో పేర్కొన్నాడు. ‘ఆ రాత్రి అసలు ఏం జరిగిందో, ఇది ఎవరిపనో ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై దృష్టిసారించాలని పంజాబ్ పోలీసులను కోరుతున్నా. ఈ హేయమైన చర్యకు ఎవరు బాధ్యులో తెలుసుకోవాల్సిన అర్హత మాకుంది. నేరస్తులు తప్పించుకుని మరో నేరం చేయడానికి వీల్లేదు’ అంటూ పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు, సీఎంవో ఆఫీస్ కు, పంజాబ్ పోలీసులకు సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.