కోచ్‌గా మరోసారి రవిశాస్త్రి ఫిక్స్!
టీమిండియా కోచ్ ఎంపిక దాదాపు పూర్తయ్యింది. మరోసారి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే పదవి దక్కింది. ఆరుగురిని ఇంటర్వ్యూలకు పిలిచిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ… చివరకు శాస్త్రినే కోచ్‌గా ఎంపికచేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత కెప్టెన్ కోహ్లీ మొదట్నుంచి రవిశాస్త్రికే ఫేవర్‌గా ఉన్నాడు. తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ, మైక్ హెసన్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లకు నిరాశే మిగిలింది. జట్టుతో పనిచేయడం […]
టీమిండియా కోచ్ ఎంపిక దాదాపు పూర్తయ్యింది. మరోసారి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే పదవి దక్కింది. ఆరుగురిని ఇంటర్వ్యూలకు పిలిచిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ… చివరకు శాస్త్రినే కోచ్‌గా ఎంపికచేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
భారత కెప్టెన్ కోహ్లీ మొదట్నుంచి రవిశాస్త్రికే ఫేవర్‌గా ఉన్నాడు. తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ, మైక్ హెసన్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లకు నిరాశే మిగిలింది. జట్టుతో పనిచేయడం రవిశాస్త్రికిది నాలుగోసారి. ఇంతకుముందు 2007లో బంగ్లాదేశ్ టూర్‌కు మేనేజర్‌గా, 2014-16 టైంలో టీం డైరెక్టర్‌గా, 2017-19 హెడ్ కోచ్‌గా పనిచేశాడు. కోచ్ పదవికి పోటీపడిన మిగిలిన వారితో పోలిస్తే రవిశాస్త్రి రికార్డు మెరుగ్గా ఉండటం అతడికి కలిసొచ్చింది.
The CAC addresses the media in Mumbai. pic.twitter.com/nmeZjWk5Yp
— BCCI (@BCCI) August 16, 2019