పాక్ కోచ్ మెడపై యూనిస్ కత్తిపెట్టడానికి కార‌ణం.. భార‌త మాజీ ఆట‌గాడేన‌ట‌..

పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు యూనిస్ ఖాన్‌కి ఆట‌కు సంబంధించి సూచ‌న‌లు చేయ‌బోతే అతను తన మెడపై కత్తిపెట్టినట్లు పాక్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ ఇటీవల సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశాడు.

పాక్ కోచ్ మెడపై యూనిస్ కత్తిపెట్టడానికి కార‌ణం.. భార‌త మాజీ ఆట‌గాడేన‌ట‌..
Follow us

|

Updated on: Jul 06, 2020 | 1:29 PM

పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు యూనిస్ ఖాన్‌కి ఆట‌కు సంబంధించి సూచ‌న‌లు చేయ‌బోతే అతను తన మెడపై కత్తిపెట్టినట్లు పాక్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ ఇటీవల సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశాడు. 2014 నుంచి 2019 వరకూ గ్రాంట్ పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్‌గా ప‌నిచేశాడు. 2016 ఆస్ట్రేలియా టూర్ లో ఆ ఘటన చోటుచేసుకున్న‌ట్లు అతను తెలిపాడు. అయితే.. యూనిస్ అలా ప్ర‌వ‌ర్తించ‌డం వెనుక భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఉన్నాడ‌ని తాజాగా పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు.

గ్రాండ్ ఫ్లవర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘యూనిస్ ఖాన్‌తో కలిసి ట్రావెల్ చెయ్య‌డం చాలా కష్టం. బ్రిస్బేన్‌లో జరిగిన ఘటన నా క‌ళ్ల ముందు మొదులుతూనే ఉంది. టెస్టు మ్యాచ్‌కి ముందు అల్పాహారం తీసుకుంటుండ‌గా.. యూనిస్‌కి బ్యాటింగ్‌పై ఓ చిన్న సూచ‌న చేయ‌బోయాను. అంతే.. అతను కోపంతో ఊగిపోతూ టేబుల్‌పై ఉన్న కత్తిని తీసి నా మెడపై పెట్టాడు. ప‌క్క‌నే ఉన్న చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ వారించడంతో యూనిస్ వెనక్కి తగ్గాడు’’ అని గ్రాంట్ ఫ్లవర్ పేర్కొన్నాడు. కాగా ప్ర‌జంట్ శ్రీలంక జట్టుకి బ్యాటింగ్‌ కోచ్‌గా గ్రాంట్ ఫ్లవర్ పనిచేస్తుండగా.. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా యూనిస్ ఖాన్ ఇటీవల ఎంపిక‌య్యాడు.

గ్రాంట్ ఫ్లవర్ వ్యాఖ్యలపై యూనిస్ ఖాన్ ఇంకా రెస్పాండ్ అవ్వ‌లేదు. కానీ.. అతనితో ఒక‌ప్పుడు క‌లిసి క్రికెట్ ఆడిన మాజీ ఆట‌గాడు రషీద్ లతీఫ్ ఆ ఘటపై మాట్లాడుతూ ‘‘డ్రెస్సింగ్ రూములో జ‌రిగిన‌దాని గురించి మాకు తెలియ‌దు. కానీ.. ఆ ఘటనకి కారణం మాత్రం అజహరుద్దీన్. ఎలా చెప్తున్నాన‌నంటే..? 2016లో ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో యూనిస్ ద్విశ‌త‌కం చేశాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత యూనిస్ మీడియాతో మాట్లాడుతూ.. అజహరుద్దీన్ ఇచ్చిన సలహాలు, సూచ‌న‌ల వ‌ల్లే తాను ఆ డబుల్ సెంచరీ చేశాన‌ని తెలిపాడు. దీంతో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తుండగా..గ్రాంట్ సలహా ఇవ్వడం యూనిస్‌కి కోపం తెప్పించింది’’ అని లతీఫ్ వివ‌రించాడు.

Mohammed Azharuddin can be reason for Younis Khan-Grant Flower knife episode,  says Rashid Latif

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?