సర్కార్‌ మాటలు నీటిమీద రాతలేనంటున్న స్టార్‌ బాక్సర్‌

|

Aug 26, 2020 | 2:30 PM

పాలకుల వాగ్దానాలను రాజముద్ర పడిన ప్రభుత్వ ఆదేశాల్లాంటివని భ్రమపడిన స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ ఇప్పుడు ఆవేదన చెందుతోంది.. పంజాబ్‌ సర్కార్‌ ఆమెకు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలాలయ్యాయట! ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నెరవేర్చలేదట!

సర్కార్‌ మాటలు నీటిమీద రాతలేనంటున్న స్టార్‌ బాక్సర్‌
Follow us on

పాలకుల వాగ్దానాలను రాజముద్ర పడిన ప్రభుత్వ ఆదేశాల్లాంటివని భ్రమపడిన స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ ఇప్పుడు ఆవేదన చెందుతోంది.. పంజాబ్‌ సర్కార్‌ ఆమెకు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలాలయ్యాయట! ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నెరవేర్చలేదట! టోక్యో ఒలింపిక్స్‌ కు అర్హత సంపాదించిన ఈ బాక్సర్‌కు అయిదు నెలల కిందట అమరీందర్‌సింగ్‌ ఎన్నో హామీలు ఇచ్చారట! ఓ ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పుకుని తెగ బాధపడింది సిమ్రన్‌ జిత్‌ కౌర్‌..అదే టిక్‌టాక్‌ స్టార్లకైతే వెంటనే ఆర్థిక సాయం చేతికందుతోందన్న విమర్శ కూడా చేశారామె! ఇప్పటికైనా తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆర్ధిక కష్టాలతో ఉన్నానని ప్రభుత్వానికి విన్నవించుకుంది. అసలు పంజాబ్‌ ప్రభుత్వం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్ధికసాయం అందిస్తున్నదో అర్థం కావడం లేదని సిమ్రన్‌ చెప్పుకొచ్చింది. సిమ్రన్‌జిత్‌ కౌర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంతో మీడియా ద్వారా ఆమె ఆర్ధిక పరిస్థితిని తెలుసుకున్నారు ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌.. అప్పుడే అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.. జనవరిలో జరిగిన ముచ్చట ఇది! ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆ హామీలు ఇంకా కార్యరూపం దాల్చలేదు..