Kapil Parmar, Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 24 మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా మరో మెడల్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో మొత్తం 25 మెడల్స్ చేరాయి. జూడో పురుషుల 60 కిలోల జే1 విభాగంలో వరల్డ్ నంబర్ అయిన కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. పారాలింపిక్స్‌లో జూడోలో భారత్‌కిది తొలి పతకం. కాంస్య పతక కోసం జరిగిన పోటీలో కపిల్ 10-0తో బ్రెజిల్‌కు చెందిన ఎలిల్టన్ డి ఒలివెరాను ఓడించాడు. అంతకుముందు సెమీ ఫైనల్స్‌లో 0-10 తేడాతో ఇరాన్ అథ్లెట్ సయ్యద్ అబాది చేతిలో ఓడాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ కపిల్ పర్మార్‌కు ఒక్కో ఎల్లో కార్డు లభించింది.
కానీ, కపిల్ అప్పుడు స్వర్ణం తీసుకురాలేకపోయినా.. ఇప్పుడు మాత్రం కాంస్య పతకాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యాడు. అతి తక్కువ కంటిచూపు కలిగిన అథ్లెట్లు ఈ జె1 కేటగిరీలో పోటీపడుతుంటారు. కపిల్ మధ్యప్రదేశ్‌లోని శివోర్ అనే గ్రామానికి చెందినవాడు. ఆయన తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదుగురు సంతానంలో కపిల్ చిన్నవాడు. బాల్యంలో పొలాల్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ నీటి పంపును తాకడంతో విద్యుదాఘాతానికి గురై కోమాలోకి వెళ్లాడు. ఈ ప్రమాదంతో అతడి కంటి చూపు బాగా మందగించింది.
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐟𝐢𝐫𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 𝐏𝐚𝐫𝐚𝐥𝐲𝐦𝐩𝐢𝐜 𝐣𝐮𝐝𝐨 𝐦𝐞𝐝𝐚𝐥! 🥋🥉
Kapil Parmar made history, defeating World No. 2 Elielton de Oliveira by Ippon to claim the bronze in the men -60kg J1 event at Paris 2024 Paralympics. 👏#Paris2024 | #Paralympics pic.twitter.com/SaSCZ3Yf3z
— Olympic Khel (@OlympicKhel) September 5, 2024
2017లో బ్లైండ్ జూడో విభాగం గురించి తెలుసుకుని జూడోలోకి ప్రవేశించాడు. 2018లో జాతీయ ఛాంపియన్‌షిప్, బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2019 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో కపిల్ స్వర్ణాలు సాధించాడు. ఇక మహిళల 48 కిలోల J2 విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన కోకిల కజకిస్థాన్‌కు చెందిన అక్మరల్ నౌట్‌బెక్‌పై 0-10 తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక భారత్ ఇప్పటివరకు 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..