Vinesh Fogat: క్షమాపణ చెప్పిన వినేశ్ ఫొగాట్.. తదుపరి చర్యలకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం

టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్‌ఐ పంపిన నోటీసుపై వినేశ్ ఫొగాట్ స్పందించింది. ఈమేరకు ఆదివారం ఆమె భారత రెజ్లింగ్ సమాఖ్యకు క్షమాపణ చెప్పారు.

Vinesh Fogat: క్షమాపణ చెప్పిన వినేశ్ ఫొగాట్.. తదుపరి చర్యలకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం
Vinesh Phogat

Updated on: Aug 15, 2021 | 9:55 PM

టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్‌ఐ పంపిన నోటీసుపై వినేశ్ ఫొగాట్ స్పందించింది. ఈమేరకు ఆదివారం ఆమె భారత రెజ్లింగ్ సమాఖ్యకు క్షమాపణ చెప్పారు. టోక్యోలో ఫొగాట్ ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఫొగాట్‌పై నిషేధాన్ని త్వరలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలసింది. దీంతో వినేశ్ ఫొగాట్ స్పందించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

శనివారం ఫొగాట్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో ఎంత స్పీడ్‌గా ఎత్తుకు ఎదుగుతామో.. అంతే స్పీడ్‌గా కిందకి పడిపోతాం. ఒక్క పతకం సాధించలేదంటే మన పని అయిపోయినట్లే. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇక్కడ అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతోంది. అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నా ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్‌లో నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్‌ తెలపింది.

రెజ్లింగ్‌పై అవగాహన లేని, షూటింగ్‌తో తెలియని ఫిజియోను తనకు కేటాయించారని భారత రెజ్లింగ్ సమాఖ్యపై విమర్శలు చేసింది. బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయం కూడా ఆ ఫిజియోకు తెలియదని, తానే ఆమెకు చెప్పాల్సి వచ్చిందని ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్‌ లేదని, తన వల్ల భారత రెజ్లర్లకు కరోనా రాకూడదనే వారికి దూరంగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. అయితే ఫొగాట్ గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురైనట్లు పేర్కొంది. మరి భారత రెజ్లింగ్ సమాఖ్య, ఫొగాట్‌ల మధ్య ఘర్షణ ఇంతటితో ఆగుతుందా లేదో చూడాలి.

Also Read: IND vs ENG: హీటెక్కిన లార్డ్స్ టెస్ట్‌.. విరాట్ కోహ్లీ-జేమ్స్ ఆండర్సన్‌ల మధ్య మాటల యుద్ధం.. టీమిండియా కెప్టెన్‌పై చర్యలు?

Neeraj Chopra: ‘విజయానికి షార్ట్‌కట్స్ తీసుకోకండి.. కష్టపడితేనే అద్భుత ఫలితం’: యువతకు ఒలింపిక్ గోల్డెన్ బాయ్ సందేశం

Loading...
Unable to load recommendations.
Follow Us