The US Open: అందరి కళ్లు వారిపైనే.. నేటి నుంచే అసలు సమరం.. యూఎస్‌ ఓపెన్‌‌ నుంచి తప్పుకున్న భారత స్టార్ ప్లేయర్..

|

Aug 29, 2022 | 9:10 PM

భారత్‌ ప్రాతినిథ్యం విషయానికి వస్తే.. స్టార్ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మిర్జా ఈ సారి గాయాల కారణంగా యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనడం లేదు.

The US Open: అందరి కళ్లు వారిపైనే.. నేటి నుంచే అసలు సమరం.. యూఎస్‌ ఓపెన్‌‌ నుంచి తప్పుకున్న భారత స్టార్ ప్లేయర్..
Us Open 2022
Follow us on

US Open 2022: ఎన్నో ఎమోషన్స్‌.. అంతకు మించిన ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యూఎస్‌ ఓపెన్‌… మరో దఫా ఆరంభం కాబోతోంది. న్యూయార్క్‌ వేదికగా ఈ గ్రాండ్‌ ఈవెంట్‌.. ఇండియన్‌ టైమ్‌ ప్రకారం ఈ అర్ధరాత్రి నుంచే మొదలవుతోంది. ఇప్పటికే ప్రధాన డ్రా మ్యాచ్‌లు ప్రారంభమైనా… అసలైన సమరం ఈ రాత్రికి మొదలు కానుంది. అత్యధిక పారితోషికం అందించే ఈ టోర్నీకి కొందరు స్టార్‌ ప్లేయర్స్ దూరంగా ఉన్నప్పటికీ.. ముఖ్యంగా సెరెనా విలియమ్స్‌, రాఫెల్‌ నాదల్‌లపైనే క్రీడాభిమానుల కళ్లు ఫిక్సయ్యాయి.

టు అండ్‌ హాఫ్‌ డెకేడ్స్‌కు పైగా ఆటతో లాంగ్‌ జర్నీ చేసి… రికార్డు స్థాయిలో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచి.. వరల్డ్‌ ఉమెన్‌ టెన్నిస్‌ దిగ్గజంగా పేరొందిన సెరెనా విలియమ్స్‌.. ఈ టోర్నీ తర్వాత టెన్నిస్‌ గుడ్‌బై చెప్పబోతోంది. దీంతో, తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి సిద్ధమైంది సెరెనా. ఈ సీజన్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని సంకేతాలిచ్చిన ఆమె.. చివరి గ్రాండ్‌స్లామ్‌ యుఎస్‌ ఓపెన్‌ బరిలో దిగుతోంది. దీంతో, అందరి చూపూ ఈ మాజీ నంబర్‌ వన్‌పైనే ఉంది. మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిస్తే అత్యధిక టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది సెరెనా. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఫైనల్‌ చేరినా.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 21వసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. దీంతో, తన ఆఖరి టౌర్నమెంట్‌లో ఎలాంటి ప్రదర్శనిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

మరోవైపు తన అక్క వీనస్‌తో కలిసి ఆమె డబుల్స్‌ బరిలోనూ దిగుతోంది. యుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సంఘం, ఈ అక్కాచెల్లెళ్ల పెయిర్‌కి డబుల్స్‌లో వైల్డ్‌కార్డు ప్రవేశం కల్పించడం విశేషం. 2018 ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత సిస్టర్స్‌ ఇద్దరూ జతకట్టడం ఇదే తొలిసారి. యుఎస్‌ ఓపెన్‌లో 2014 తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ స్వైటెక్‌, వింబుల్డన్‌ రన్నరప్‌ జబెర్‌, హలెప్‌, జెస్సికా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రదుకాను, ఒసాక, కొంటావీట్‌, సకారి, బడోసా, సబలెంక, కోకోగాఫ్‌ సైతం… టైటిల్‌పై కన్నేసిన ఆటగాళ్ల లిస్టులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈసారి స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ జకోవిచ్‌ లేకపోవడంతో.. పురుషుల సింగిల్స్‌లో ఫేవరేట్‌గా అడుగుపెడుతున్నాడు నాదల్‌. ఈసారి మూడో గ్రాండ్‌స్లామ్‌ గెలిచేందుకు.. అతనికిది భలే ఛాన్సని కూడా అభిప్రాయపడుతున్నారు క్రీడాభిమానులు. ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్ గెలిచిన నాదల్‌… మరో టైటిల్‌ మీద కన్నేశాడు. అయితే, కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా, జకోవిచ్‌ దూరమవడం నాదల్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. అయితే, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మెద్వెదెవ్‌తో నాదల్‌కు అంత ఈజీగా కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోయిన రెండు సీజన్లకూ దూరంగా ఉన్న నాదల్‌.. ఈ సారి టైటిల్‌ను గెలవాలన్న కసితో ఉన్నాడు. కొంతకాలం క్రితం వరకు అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టినా.. ప్రస్తుతం మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు నాదల్‌. ఇప్పటికే 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచి టాప్‌లో ఉన్న నాదల్‌కు… అపోనెంట్స్‌ నుంచి గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది. మెద్వెదెవ్‌తో పాటు స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాజ్‌, సిట్సిపాస్‌, కిర్గియోస్‌ లతో టఫ్‌ వార్‌ ఉంటుందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు క్రీడావిశ్లేషకులు.

ఈసారి గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలకు ఓ ప్రత్యేకత ఉంది. టెన్నిస్‌ కోర్టులోకి కోచ్‌లను కూడా అనుమతివ్వాలని నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. కోర్టులోనే ఓ పక్కన కూర్చుని.. తమ క్రీడాకారులకు సూచనలించేందుకు కోచ్‌లకు అవకాశం దక్కనుంది. తొలిసారిగా యుఎస్‌ ఓపెన్‌తోనే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఈ పద్ధతిని ప్రవేశపెడుతుండటం విశేషం. ఫైనల్‌ సెట్‌ టై బ్రేకర్‌ విన్నర్‌ రూల్స్‌లోనూ మార్పులు చేర్పులు చేశారు. ముందుగా 7పాయింట్లు సాధించిన ప్లేయర్లనే.. గతంలో విజేతగా నిలవాలంటే 10పాయింట్లు గెలవాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పాయింట్ల సంఖ్యను ఏడుకు కుదించారు.

మరి, ఈ సారి గ్రాండ్‌ స్లామ్‌ విన్నర్‌ ఎవరు? ఎవరిని విజయం వరించబోతోంది? అనేది ఆసక్త రేపుతోంది. ఈ విషయంలో తాను మరోసారి సర్‌ప్రైజింగ్‌ విన్నర్‌నే ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నట్టు ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ రిషిక సుంకర చెబుతోంది.

అసలు యూఎస్‌ ఓపెన్‌కు, ఇతర టౌర్నమెంట్లకూ తేడా ఏంటి? మిక్స్‌డ్‌లో, సింగిల్స్‌లో, డబుల్స్‌లో, విజేతను ఎలా ఎంపిక చేస్తారు? అన్నదే ఇక్కడ ఆసక్తికరం. ఇక, భారత్‌ ప్రాతినిథ్యం విషయానికి వస్తే.. స్టార్ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మిర్జా ఈ సారి గాయాల కారణంగా యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనడం లేదు.