Paris Olympics: శృంగారానికి ఆంక్షలు.. పారిస్‌లో ఆటగాళ్లకు ‘యాంటీ సెక్స్ బెడ్స్’..? అసలు మ్యాటర్ వేరే ఉందిగా

|

Jul 22, 2024 | 11:04 AM

Paris Olympics Bed Size: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు పారిస్ చేరుకోవడం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో క్రీడా గ్రామం కూడా క్రీడాకారులతో కళకళలాడనుంది. క్రీడా గ్రామంలో వేలాది మంది క్రీడాకారులు కొత్త స్నేహితులను ఏర్పరుచుకుంటారు. వారి జీవితంలో భిన్నమైన స్థానాన్ని కలిగి ఉండే అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకుంటుంటారు. నిర్వాహకులు క్రీడాకారులకు అనుగుణంగా క్రీడా గ్రామాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు.

Paris Olympics: శృంగారానికి ఆంక్షలు.. పారిస్‌లో ఆటగాళ్లకు యాంటీ సెక్స్ బెడ్స్..? అసలు మ్యాటర్ వేరే ఉందిగా
Paris Olympics 2024 Bed Size
Follow us on

Paris Olympics Bed Size: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు పారిస్ చేరుకోవడం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో క్రీడా గ్రామం కూడా క్రీడాకారులతో కళకళలాడనుంది. క్రీడా గ్రామంలో వేలాది మంది క్రీడాకారులు కొత్త స్నేహితులను ఏర్పరుచుకుంటారు. వారి జీవితంలో భిన్నమైన స్థానాన్ని కలిగి ఉండే అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకుంటుంటారు. నిర్వాహకులు క్రీడాకారులకు అనుగుణంగా క్రీడా గ్రామాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. తద్వారా ఆటగాళ్లంతా క్రీడా గ్రామంలో విశ్రాంతి తీసుకోవచ్చు. కఠినమైన ప్రాక్టీస్, మ్యాచ్‌ల తర్వాత, వీరు క్రీడా గ్రామంలో తమ ఇంటిలో ఉన్నట్లు భావించాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు.

స్పోర్ట్స్‌ విలేజ్‌లో నిత్యావసర వస్తువుల నుంచి ఆటగాళ్ల గదులు, మంచాల వరకు ప్రతిదానిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కానీ, స్పోర్ట్స్‌ విలేజ్‌లో ఆటగాళ్లకు ఇచ్చే బెడ్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, బెస్ సైజ్ చాలా చిన్నదిగా ఉంది. ప్రశాంతంగా పడుకోవడానికి సరిపోయేలా లేదు. అయితే, నిర్వాహకుల వర్షెన్ మాత్రం వేరేలా ఉంది. పోటీ సమయంలో ఆటగాళ్లను సెక్స్‌కు దూరంగా ఉంచేందుకు ఇలాంటి బెడ్స్ తయారు చేసినట్లు చెబుతున్నారు. యాంటీ సెక్స్ బెడ్స్‌ (anti sex beds) తయారు చేసేందుకు ప్రత్యేక పదార్థాలను ఉపయోగించినట్లు తెలిపారు. టోక్యో 2020 ఒలింపిక్ క్రీడలలో ఉపయోగించిడిన జపనీస్ కంపెనీ ఎయిర్‌వేవ్ చేసిన బెడ్స్ ఇలానే ఉన్నాయని, వాటినే ఇక్కడ ఉపయోగించినట్లు ప్రకటించారు.

బెడ్ సైజ్‌పై గందరగోళం..

టోక్యో ఒలింపిక్స్‌లో ఆటగాళ్లకు అందించిన బెడ్‌ల పరిమాణానికి సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే సమయంలో అథ్లెట్లు శారీరక సంబంధాలు పెట్టుకోకుండా ఉండేందుకు ఇలాంటివి ఇచ్చారని అమెరికన్ రన్నర్ పాల్ చెలిమో అప్పట్లో సోషల్ మీడియాలో తెలిపారు. అయితే, బెడ్ సైజు విషయంలో నిర్వాహకులు భిన్నమైన వాదనను వినిపించారు. ఒలింపిక్ అధికారులు మాత్రం ఇలాంటి బెడ్ ఎంచుకోవడానికి స్థిరత్వమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. Mattress, కార్డ్‌బోర్డ్ ఫ్రేమ్ 100 శాతం రీసైకిల్ చేస్తామని, బెడ్ బేస్ కూడా రీసైకిల్ కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

బెడ్‌ని పరీక్షించిన అథ్లెట్..

ఈ క్రమంలో ఓ అథ్లెట్ బెడ్‌ క్వాలిటీని టెస్ట్ చేశాడు. పారిస్ ఒలింపిక్స్ కోసం ఉపయోగించిన బెడ్స్ సైజ్‌లో చిన్నగానే ఉన్నాయని, అయితే, ఇవి చాలా ధృడంగా ఉన్నాయని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..