Big News: వినేష్ ఫోగట్ రజత పతకం అందుకుంటుందా.. తుది తీర్పు ఎలా ఉందంటే?

|

Aug 10, 2024 | 5:33 PM

Vinesh Phogat Case: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో వినేష్ ఫోగట్ అధిక బరువుతో ఒలింపిక్స్ ఫైనల్‌‌ ఆడకుండా నిషేధించారు. దీంతో దేశమంతా షాక్‌కు గురైంది. 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమెపై అనర్హత వేటుపడింది. దీని తర్వాత, వినేష్ కేసు స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)కి చేరుకుంది.

Big News: వినేష్ ఫోగట్ రజత పతకం అందుకుంటుందా.. తుది తీర్పు ఎలా ఉందంటే?
Vinesh Phogat
Follow us on

Vinesh Phogat Case: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో వినేష్ ఫోగట్ అధిక బరువుతో ఒలింపిక్స్ ఫైనల్‌‌ ఆడకుండా నిషేధించారు. దీంతో దేశమంతా షాక్‌కు గురైంది. 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమెపై అనర్హత వేటుపడింది. దీని తర్వాత, వినేష్ కేసు స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)కి చేరుకుంది. ఇక్కడ అందరి వాదనలు విన్న తర్వాత, దీనిపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనే దానిపై పెద్ద సమాచారం వెలుగులోకి వచ్చింది.

వినేష్ ఫోగట్ కేసు విచారణ తర్వాత, ఇప్పుడు ఆగస్టు 10 రాత్రి 9:30 గంటలకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తన చివరి, చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం.

వినేష్ ఫోగట్ తరపు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపించారు?

వినేష్ ఫోగట్ కేసు విచారణ సందర్భంగా ఆమె లాయర్లు మూడు వాదనలను నొక్కి చెప్పారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, న్యాయవాదులు CAS, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు మూడు పాయింట్లను అందించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

– ఆమె ఎలాంటి మోసం లేదా ఫోర్జరీ చేయలేదు.

– శరీరం సహజ రికవరీ ప్రక్రియ కారణంగా ఆమె బరువు పెరిగింది. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి క్రీడాకారుడి ప్రాథమిక హక్కు.

– పోటీలో మొదటి రోజు ఆమె బరువు నిర్దేశిత పరిమితిలో ఉంది. రికవరీ చేయవలసి ఉన్నందున బరువు పెరిగింది. ఇది మోసం కాదు. శరీరం కోలుకునేలా పోషకాలను అందించడం వారి ప్రాథమిక హక్కు.

ఒకే రోజులో మూడు మ్యాచ్‌లు గెలిచిన వినేష్ ఫోగట్..

పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో, వినేష్ ఫోగట్ మొదటి రౌండ్‌లో జపాన్‌కు చెందిన ప్రపంచ నంబర్ వన్ యుయి సుసాకిని ఓడించి, ఆపై క్వార్టర్ ఫైనల్స్, సెమీ-ఫైనల్‌లో గెలిచి, వినేష్ ఫైనల్‌కి అంటే బంగారు పతకం రౌండ్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ రోజు ఉదయం వినేష్ బరువును కొలవగా.. 50 కిలోల 150 గ్రాములు ఉన్నట్లు తేలింది. దీంతో వినేష్‌పై అనర్హత వేటు పడింది. దీని వల్ల ఆమెకు రజత పతకం కూడా దక్కలేదు. ఇప్పుడు వినేష్ ఈ కేసులో గెలిస్తే ఆమెకు ఉమ్మడి రజత పతకం ఇవ్వవచ్చు అని అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..