పారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించాడు. బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా అర్షద్ నదీమ్ ఈ క్రీడలో కొత్త ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాడు. ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన అర్షద్ పాకిస్థాన్‌కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అర్షద్‌కు అద్భుతమైన స్వాగతం లభించింది. ఆయన స్వగ్రామానికి వెళ్లినప్పుడు అపూర్వ స్వాగతం లభించింది. ఈ క్రమంలో బంగారు పతకం సాధించినందుకుగానూ అర్షద్ అత్తమామలు ఓ గేదెను బహుమతిగా ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారంట.
అర్షద్ నదీమ్ పాకిస్థాన్ చేరకముందే అతడిపై రివార్డుల వర్షం కురిపించారు. చేతనైనంత సాయం చేస్తామని చాలామంది ప్రకటించారు. ఈ క్రమంలో ఎంతోమంది తమ అల్లుడికి కానుకలు ఇస్తుంటే.. మామగారు మాత్రం.. పల్లెటూరి వాతావరణం, సంప్రదాయానికి అనుగుణంగా, అతను తన అల్లుడికి గేదెను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
గేదెను బహుమతిగా ఇచ్చిన కారణాన్ని కూడా అర్షద్ నదీమ్ మామ చెప్పుకొచ్చాడు. గేదెను బహుమతిగా ఇవ్వడం తమ గ్రామంలో ఎంతో విలువైనదిగానూ, గౌరవప్రదంగానూ పరిగణిస్తుంటారు. ఆయన మాట్లాడుతూ నదీమ్ తన మూలాల గురించి చాలా గర్వపడుతున్నాడు. ఇంత విజయం సాధించినా తన గ్రామాన్ని వదల్లేదు. అతను ఇప్పటికీ తన తల్లిదండ్రులు, సోదరులతో నివసిస్తున్నాడు.
అర్షద్ నదీమ్ మామగారి ప్రకారం, అతను మా చిన్న అల్లుడు. తనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వీరిలో చిన్న కుమార్తె అయేషాకు నదీమ్‌తో వివాహమైందని తెలిపాడు. తన చిన్న కుమార్తెను నదీమ్‌తో వివాహం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అతను అప్పట్లో చిన్న ఉద్యోగాలు చేసేవాడని అర్షద్ మామ తెలిపాడు. అయితే, అర్షద్‌కు మొదటి నుంచి జావెలిన్ క్రీడపై చాలా మక్కువ ఉండేదని, పొలాల్లో పనిచేస్తూ జావెలిన్ విసరడం సాధన చేసేవాడంటూ చెప్పుకొచ్చాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల జావెలిన్ విసిరి బంగారు పతకం సాధించాడు. ఈ గేమ్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..