
హాకీ ప్రపంచ కప్ 2023 జనవరి 13 శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి ప్రపంచకప్ ఒడిశాలో జరగనుంది. స్వదేశంలో జరిగే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇంతకు ముందు భారత జట్టు 1975లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఈసారి టీమ్ ఇండియా ముగింపు పలకవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఆటగాళ్లు ఈసారి ప్రపంచకప్ గెలవడానికి కీలక సహకారం అందించగలరు. అలాంటి ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1. గోల్ మెషిన్ ఆకాష్‌దీప్ సింగ్: భారత జట్టు స్టార్ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్ 2012లో అరంగేట్రం చేశాడు. ఆకాష్ అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతను 200కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. ఆకాష్ 80కి పైగా గోల్స్ చేశాడు. ఆకాశ్‌దీప్ ఈ ఏడాది మూడో ప్రపంచకప్ ఆడనున్నాడు.

2. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్: భారత టీమ్ స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఈసారి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అంతకుముందు 2018 ప్రపంచ కప్ కూడా ఆడాడు. అయితే ఈసారి కెప్టెన్‌గా అతనిపై మరింత ఒత్తిడి ఉం+ది. హర్మన్‌ప్రీత్ సింగ్ తన కెరీర్‌లో జూనియర్ ప్రపంచకప్, ఆసియాకప్ వంటి టోర్నీలను గెలుచుకున్నాడు.

3. మన్‌ప్రీత్ సింగ్: గత ప్రపంచకప్‌లో జట్టుకు నాయకత్వం వహించిన మన్‌ప్రీత్ సింగ్ ఈసారి సాధారణ ఆటగాడిగా జట్టులోకి రానున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కీలక ఆటగాడిగా నిరూపించుకోగలడు.

4. మన్‌దీప్ సింగ్: మన్‌దీప్ సింగ్ స్పెషాలిటీ వేరు. ప్రత్యర్థి జట్టును మోసం చేయడంలో, పెనాల్టీ కార్నర్‌లు తీసుకోవడంలో మన్‌దీప్ సింగ్‌కు నైపుణ్యం ఉంది. 2022లో జట్టు తరపున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతను మొత్తం 13 గోల్స్ చేశాడు.

5. గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్: పీఆర్ శ్రీజేష్ జట్టుకు అనుభవజ్ఞుడైన గోల్ కీపర్. పీఆర్ శ్రీజేష్ ఈసారి మూడో ప్రపంచకప్ ఆడనున్నాడు. అతని ఈ అనుభవం జట్టుకు చాలా కీలకం కానుంది.