ముంబై ఇండియన్స్‌కు శుభ‌వార్త

ముంబై ఇండియన్స్‌కు శుభ‌వార్త. శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగా త్వరలోనే జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్‌ సెలెక్షన్‌ కోసం ఈ నెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్‌ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో.. మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ లంక క్రికెట్‌ బోర్డును మలింగా విషయంలో స్పష్టత కోరినట్లు తెలిసింది. దాంతో చేసేదిలేక మలింగాకు ఎస్‌ఎల్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఐపీఎల్‌లో మలింగా ఆడటానికి ఎటువంటి […]

ముంబై ఇండియన్స్‌కు శుభ‌వార్త

Edited By:

Updated on: Mar 25, 2019 | 7:03 PM

ముంబై ఇండియన్స్‌కు శుభ‌వార్త. శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగా త్వరలోనే జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్‌ సెలెక్షన్‌ కోసం ఈ నెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్‌ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో.. మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ లంక క్రికెట్‌ బోర్డును మలింగా విషయంలో స్పష్టత కోరినట్లు తెలిసింది. దాంతో చేసేదిలేక మలింగాకు ఎస్‌ఎల్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

‘ఐపీఎల్‌లో మలింగా ఆడటానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇప్పటికే అతనికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేశాం. అతను స్వేచ్ఛగా ఐపీఎల్‌ ఆడవచ్చు. వన్డేల్లో అతను మాకు ప్రధాన బౌలర్‌. అతనికి జట్టులో చోటు కల్పించే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఐపీఎల్‌ ఆడినా.. వరల్డ్‌కప్‌కు వెళ్లే మా జట్టులో మలింగా స్థానంపై ఢోకా ఉండదు’ అని ఎస్‌ఎల్‌సీ చీఫ్‌ సెలక్టర్‌ అశంతా డిమెల్ పేర్కొన్నారు.