‘ఖేల్‌రత్న’కు బజ్‌రంగ్‌ పూనియా, దీపా మాలిక్! 

ప్రఖ్యాత రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా పేరును అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న కోసం నామినేట్‌ చేశారు. 12 మంది సభ్యులతో కూడిన అవార్డుల కమిటీ పూనియా పేరును తొలి రోజు సమావేశంలోనే ఏకగ్రీవంగా ఖరారు చేసింది. జస్టిస్‌ ముకుందకం శర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో బైచుంగ్‌ భూటియా, మేరీకోమ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఆసియా, కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించినప్పటికీ గతేడాది ఖేల్‌రత్న కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోర్టులోనే తేల్చుకుంటానని బజ్‌రంగ్‌ […]

‘ఖేల్‌రత్న’కు బజ్‌రంగ్‌ పూనియా, దీపా మాలిక్! 
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 9:25 PM

ప్రఖ్యాత రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా పేరును అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న కోసం నామినేట్‌ చేశారు. 12 మంది సభ్యులతో కూడిన అవార్డుల కమిటీ పూనియా పేరును తొలి రోజు సమావేశంలోనే ఏకగ్రీవంగా ఖరారు చేసింది. జస్టిస్‌ ముకుందకం శర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో బైచుంగ్‌ భూటియా, మేరీకోమ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఆసియా, కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించినప్పటికీ గతేడాది ఖేల్‌రత్న కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోర్టులోనే తేల్చుకుంటానని బజ్‌రంగ్‌ హెచ్చరించాడు. అయితే, ఈసారి అతడి కోరిక నెరవేరినట్టయింది.

Latest Articles