Watch : ఫుట్‌బాల్ మ్యాచ్ కాస్తా బాక్సింగ్ రింగ్‌లా మారింది.. గ్రౌండ్లోనే తుక్కుతుక్కు కొట్టుకున్నారు
Watch : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ముగిసిన వెంటనే అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. లేయాండ్రో పారేడెస్ రెడ్ కార్డ్ అందుకోగా, గావిపై దాడి వీడియో వైరల్‌గా మారింది. మెస్సీ కన్నీటి వీడ్కోలు అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.

Watch : న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో స్పెయిన్ 1-0 గోల్ తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫెర్రాన్ తోర్రెస్ కొట్టిన గోల్‌తో స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో చోటుచేసుకున్న ఘర్షణలు ఈ చారిత్రాత్మక విజయాన్ని కాస్త నీరుగార్చాయి. రిఫరీ విజిట్ ఊదిన వెంటనే రెండు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లేయాండ్రో పారేడెస్ స్పెయిన్ ఆటగాళ్లపై భౌతిక దాడికి దిగడంతో, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆయనకు నేరుగా రెడ్ కార్డ్ చూపించాల్సి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన వెంటనే స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అంతా మైదానంలోకి పరిగెత్తుకొచ్చి సంబరాలు ప్రారంభించారు. ఆ సమయంలో స్పెయిన్ కెప్టెన్ రోడ్రి పక్కనుంచి వెళ్తుండగా అర్జెంటీనా డిఫెండర్ నహుయెల్ మొలీనా ఆయనపై చెయ్యి చేసుకునేందుకు ప్రయత్నించాడని సమాచారం. దీంతో రోడ్రి ఆగి మొలీనాను నిలదీశాడు. వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పరిస్థితిని అదుపు చేయడానికి స్పెయిన్ డిఫెండర్ ఎరిక్ గార్సియా మధ్యలో కలగజేసుకున్నాడు. కానీ ఈ గొడవ సద్దుమణగడానికి బదులుగా మరింత పెరిగింది.
ఘటన స్థలానికి చేరుకున్న పారేడెస్, ఎరిక్ గార్సియా గొంతు పట్టుకుని పక్కకు తోసివేశాడు. అర్జెంటీనా మేనేజర్ లియోనెల్ స్కలోని వెంటనే స్పందించి ఆటగాళ్లను విడదీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పారేడెస్, స్పెయిన్ యంగ్ స్టార్ గావిపై విరుచుకుపడ్డాడు. గావి గొంతు పట్టుకుని నేలపై పడేయడంతో పాటు, ఆయన జెర్సీని పట్టుకుని తీవ్రంగా ప్రవర్తించాడు. ఇది చూసిన స్పెయిన్ ప్లేయర్లు గావికి మద్దతుగా రాగా, సినారియో అంతా చూసిన స్లోవేనియా రెఫరీ శ్లేవ్‌కో విన్సిచ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పారేడెస్‌కు నేరుగా రెడ్ కార్డ్ జారీ చేశారు.
🚨 Gavi and Leandro Paredes clash after the final whistle of Spain vs Argentina. pic.twitter.com/mU1H32Dyex
— Sports on Predict (@sportsonpredict) July 19, 2026
మైదానంలో అర్జెంటీనా ప్లేయర్లు ప్రవర్తించిన తీరుపై స్పోర్ట్స్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్యారీ నెవిల్లే స్పందిస్తూ.. “పారేడెస్ ప్రవర్తన అత్యంత సిగ్గుచేటు. ఆయన మ్యాచ్ మధ్యలోనే రెడ్ కార్డ్ సాధించి బయటకు వెళ్లాల్సి ఉంది” అని ఘాటుగా విమర్శించారు. అలాగే బీబీసీ వ్యాఖ్యాత అలెన్ షియరర్ మాట్లాడుతూ.. “మ్యాచ్‌లో ఓడిపోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది, కానీ ఓడిపోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అర్జెంటీనా నుంచి ఇలాంటి దారుణమైన ప్రవర్తనను చూడటం చాలా బాధాకరం” అని వ్యాఖ్యానించారు.
Massive fight at the end of the game as Paredes was seen getting physical.
Argentina coach had to separate and few others #WorldCup #Spain #Messi #ArgentinaVsEspaña #EspañaArgentina pic.twitter.com/jYNSkvZuec
— Ultimateinvest (@UPlays1051) July 19, 2026
తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్ ఆడుతున్నట్లుగా భావిస్తున్న లియోనెల్ మెస్సీకి ఈ మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నీ అంతటా అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్స్ వరకు తీసుకువచ్చిన మెస్సీ, ఈ వివాదాస్పద ఘట్టంతో కలత చెందాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కన్నీటి పర్యంతమవుతూ అభిమానులకు అభివాదం తెలిపిన మెస్సీ, రన్నరప్ మెడల్‌ను స్వీకరించాడు. స్పెయిన్ జట్టు తమ రెండో ప్రపంచకప్‌ను సాధించి ఘనంగా సంబరాలు చేసుకోగా, అర్జెంటీనా మాత్రం ఓటమితో పాటు ఈ రచ్చతో తీవ్ర విమర్శల పాలైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
