ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌

మహేంద్ర సింగ్ ధోనీ పేరు మీద జొమాటో సంస్థ అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌జ‌ల‌లో ఆట‌గాడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు ధోని. అయితే శ‌నివారం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దీంతో అభిమానులు, సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు త‌మదైన రీతిలో..

ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 7:21 PM

మహేంద్ర సింగ్ ధోనీ పేరు మీద జొమాటో సంస్థ అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌జ‌ల‌లో ఆట‌గాడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు ధోని. అయితే శ‌నివారం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దీంతో అభిమానులు, సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు త‌మదైన రీతిలో సోష‌ల్ మీడియాలో భార‌త జ‌ట్టుకు అందించిన సేవ‌ల‌కు ధోనికి ధ‌న్య వాదాలు తెలుపుతున్నారు. ఇక ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జొమాటో కూడా త‌న స్టైల్‌లో ధోనికి ధ‌న్య‌వాదాలు తెలిపింది. అయితే అంద‌రిలా ట్వీట్ చేయ‌లేదు. ఏకంగా ధోని పేరు మీద ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది జొమాటో. ఇంత‌కీ ఆ ఆఫ‌ర్ ఏంటంటే.. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 12 గంట‌ల వ‌ర‌కు 183 రూపాయ‌ల‌లోపు ఏం ఆర్డ‌ర్ చేసిన అది 100 శాతం ఉచితం అని ప్ర‌క‌టించింది. అయితే ఆ ఆఫ‌ర్ కేవ‌లం రాంచీ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది అని ట్వీట్‌లో పేర్కొంది. ఈ ఆఫ‌ర్ ఉప‌యోగించుకోవాలంటే మ‌హీ అనే కోడ్ ఉప‌యోగించాలి. ఇది ధోనికి అంకితం అని జొమాటో సంస్థ తెలిసింది.

Read More:

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌