AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్ రేసు ఖరారు.. టీమిండియాతో తలపడబోయే జట్టు ఇదే

Womens Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్ రేసు ఖరారైంది. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరడంతో టీమిండియాతో తలపడనుంది. సెప్టెంబర్ 10న భారత్-బంగ్లాదేశ్ తొలి సెమీఫైనల్ జరగనుండగా, సెప్టెంబర్ 11న శ్రీలంక-పాకిస్థాన్ రెండో సెమీస్‌లో పోటీపడతాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ జరగనుంది. అజేయంగా కొనసాగుతున్న హర్మన్‌ప్రీత్ సేన ఫైనల్ బెర్త్‌పై కన్నేసింది.

Womens Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్ రేసు ఖరారు.. టీమిండియాతో తలపడబోయే జట్టు ఇదే
India Women Vs Bangladesh Women
Rakesh
|

Updated on: Sep 09, 2026 | 11:45 AM

Share

Womens Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 నాకౌట్ సమరానికి తెరలేచింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియడంతో సెమీఫైనల్స్ రేసు ఖరారైంది. యూఏఈపై ఉత్కంఠ విజయం సాధించిన బంగ్లాదేశ్ నాలుగో జట్టుగా సెమీస్ అర్హత సాధించింది. మొదటి సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. గ్రూప్-బి లో తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మంగళవారం యుఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమాన పాయింట్లు ఉండటంతో గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశం లభించే పరిస్థితి ఏర్పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిగార్ సుల్తానా సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. యుఏఈ బౌలర్ సురక్ష కొట్టే 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. షర్మీన్ అక్తర్ చేసిన 38 పరుగుల తోడ్పాటుతో బంగ్లాదేశ్ 103 పరుగుల స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగింది.

104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యుఏఈ బ్యాటర్లు బంగ్లాదేశ్ బౌలింగ్ ధాటికి నిలవలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేయడంతో 34 పరుగుల తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకున్నారు. ఈ విజయంతో గ్రూప్-బి నుంచి శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

గ్రూప్-ఎ లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళల జట్టు, గ్రూప్-బి లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌తో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 10 గురువారం రాత్రి 8 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. టోర్నీ పొడవునా అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ సేన ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

రెండో సెమీఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11 శుక్రవారం జరగనుంది. గ్రూప్-బి టాపర్ శ్రీలంక, గ్రూప్-ఎ లో రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ జట్లు ఈ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్‌లో విజేతలుగా నిలిచిన జట్లు సెప్టెంబర్ 13న జరిగే మహా ఫైనల్లో ఆసియా కప్ ట్రోఫీ కోసం పోరాడతాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us