IPL 2026: ఐపీఎల్‌లో ఈరోజు మ్యాచ్ ఎందుకు లేదో తెలుసా.. అసలు కారణం ఏంటంటే?

No IPL 2026 Match Today: క్రికెట్ పండుగలో ఒకరోజు విరామం అభిమానులకు కాస్త నిరాశ కలిగించినప్పటికీ, రేపటి నుంచి మొదలయ్యే అసలైన హై-వోల్టేజ్ మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఈసారి ఐపీఎల్ కిరీటాన్ని ఎవరు ముద్దాడుతారో చూడాలి.

IPL 2026: ఐపీఎల్‌లో ఈరోజు మ్యాచ్ ఎందుకు లేదో తెలుసా.. అసలు కారణం ఏంటంటే?
Ipl 2026

Updated on: May 25, 2026 | 5:41 PM

IPL 2026 Playoffs Schedule: క్రికెట్ ప్రేమికులను గత కొన్ని రోజులుగా ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2026 లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ప్రతిరోజూ సాయంత్రం కాగానే టీవీల ముందు కూర్చునే అభిమానులకు మే 25న (సోమవారం) నిరాశే ఎదురైంది. ఈరోజు ఒక్క మ్యాచ్ కూడా షెడ్యూల్ చేయలేదు. అసలు ఈరోజు మ్యాచ్ ఎందుకు లేదు? ప్లేఆఫ్స్ పోరు ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

లీగ్ సమరం ముగిసింది.. ప్లేఆఫ్స్ వేదికలు సిద్ధమయ్యాయి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి ఘట్టానికి చేరుకుంది. అభిమానులను ఎంతగానో అలరించిన లీగ్ మ్యాచ్‌లు విజయవంతంగా ముగిశాయి. ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులు తిరుగుతూ సాగింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ముందే తమ స్థానాలను ఖాయం చేసుకోగా.. నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి రాజస్థాన్ రాయల్స్ చివరి ప్లేఆఫ్స్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

లీగ్ దశ ముగిసిన తర్వాత ప్లేఆఫ్స్ చేరిన నాలుగు జట్లకు తదుపరి మ్యాచ్‌లకు సిద్ధం కావడానికి, ప్రయాణ అలసట నుంచి ఉపశమనం పొందడానికి బీసీసీఐ ఒక రోజు విరామం ప్రకటించింది. లీగ్ దశలో నిరంతరం ప్రయాణాలు, మ్యాచ్‌లతో అలసిపోయిన ఆటగాళ్లకు ఈ విరామం ఎంతో అవసరం. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఒత్తిడితో కూడుకున్నవి కావడంతో, జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటాయి. అందుకే ఈరోజు (మే 25న) ఎలాంటి మ్యాచ్‌ను నిర్వహించడం లేదు.

ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే: ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ‘క్వాలిఫైయర్-1’లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.

మరోవైపు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో తలపడతాయి. ఇందులో ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ‘క్వాలిఫైయర్-1’లో ఓడిన జట్టుతో ‘క్వాలిఫైయర్-2’లో తలపడాల్సి ఉంటుంది.

ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలు: మే 26 నుంచి అసలైన సమరం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

మే 26 (మంగళవారం) – క్వాలిఫైయర్ 1: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT). వేదిక: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల.

మే 27 (బుధవారం) – ఎలిమినేటర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR). వేదిక: మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్).

మే 29 (శుక్రవారం) – క్వాలిఫైయర్ 2: క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత. వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.

మే 31 (ఆదివారం) – గ్రాండ్ ఫైనల్: క్వాలిఫైయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫైయర్-2 విజేత. వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.

క్రికెట్ పండుగలో ఒకరోజు విరామం అభిమానులకు కాస్త నిరాశ కలిగించినప్పటికీ, రేపటి నుంచి మొదలయ్యే అసలైన హై-వోల్టేజ్ మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఈసారి ఐపీఎల్ కిరీటాన్ని ఎవరు ముద్దాడుతారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us