AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులకు నల్ల బ్యాండ్లతో బరిలోకి భారత్, జింబాబ్వే మహిళా క్రికెటర్లు.. ఎందుకంటే?

రాయ్‌పూర్‌లో భారత్, జింబాబ్వే మహిళల తొలి T20 మ్యాచ్‌లో ఇరుజట్ల క్రీడాకారిణులు నల్ల బ్యాండ్లు ధరించారు. ఇటీవల మరణించిన జింబాబ్వే మాజీ క్రికెటర్, అంపైర్ సారా దంబనేవానాకు నివాళిగా ఈ బ్యాండ్లు ధరించారు. 36 ఏళ్ల సారా 2009-2014 మధ్య ఫాస్ట్ బౌలర్‌గా సేవలందించి, తర్వాత అంపైర్‌గా మారారు. ఆమె మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ప్రత్యేక నివాళిని అర్పించారు.

చేతులకు నల్ల బ్యాండ్లతో బరిలోకి భారత్, జింబాబ్వే మహిళా క్రికెటర్లు.. ఎందుకంటే?
India, Zimbabwe Womens Players Wearing Black Armbands
Venkata Chari
|

Updated on: Oct 16, 2026 | 7:34 PM

Share

రాయ్‌పూర్‌లో భారత్ మహిళల జట్టు, జింబాబ్వే మహిళల జట్టు మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. ఇటీవల మరణించిన జింబాబ్వే మాజీ క్రికెటర్, అంపైర్ సారా దంబనేవానాకు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించినట్లు తెలుస్తోంది.

సారా దంబనేవానాకు నివాళి..

జింబాబ్వే మాజీ క్రికెటర్, అంపైర్ సారా దంబనేవానా అక్టోబర్ 12, 2026న హరారేలో కన్నుమూశారు. ఆమె వయసు 36 సంవత్సరాలు. సారా మరణాన్ని జింబాబ్వే క్రికెట్ అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది.

2009 నుంచి 2014 వరకు సారా జింబాబ్వే తరపున ఫాస్ట్ బౌలర్‌గా ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2023 సెప్టెంబర్‌లో అంపైర్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది మార్చిలో వైద్య ప్రక్రియ చేయించుకున్న అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు జింబాబ్వే క్రికెట్ తెలిపింది.

ఆమె మరణంతో భారత్, జింబాబ్వే మహిళల మధ్య రాయ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో ప్రత్యేక నివాళి అర్పించారు. సారా దంబనేవానా జ్ఞాపకార్థం ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి మ్యాచ్‌లో పాల్గొన్నారు.

Follow Us