Virat Kohli: ఇండియా వర్సెస్‌ హాంకాంగ్‌ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం.. ఆరేళ్ల తర్వాత మళ్లీ మ్యాజిక్ చేసిన విరాట్‌ కోహ్లి..

Virat Kohli: ఆసియాక్‌ కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. 40 పరుగుల తేడాతో భారత్‌ విజయకేతం ఎగరవేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 44 బంతుల్లో 59 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు...

Virat Kohli: ఇండియా వర్సెస్‌ హాంకాంగ్‌ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం.. ఆరేళ్ల తర్వాత మళ్లీ మ్యాజిక్ చేసిన విరాట్‌ కోహ్లి..
Virat Kohli

Updated on: Sep 01, 2022 | 5:45 PM

Virat Kohli: ఆసియాక్‌ కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. 40 పరుగుల తేడాతో భారత్‌ విజయకేతం ఎగరవేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 44 బంతుల్లో 59 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. బ్యాటింగ్‌తో హోరెత్తిచ్చిన విరాట్‌ బౌలింగ్‌లోనూ మెరిశాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత విరాట్‌ టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో డెత్‌ ఓవర్లలో విరాట్‌ బౌలింగ్ వేశాడు. 17వ ఓవర్‌లో బౌలింగ్‌ వేసిన విరాట్‌ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక పార్ట్‌టైమ్‌ బౌలర్‌ కీలకమైన ఓవర్‌లో ఇంత తక్కువ పరుగులు ఇవ్వడం అంత సాధారణ విషయమేమి కాదు. ఇదిలా ఉంటే విరాట్‌ చివరిసారిగా 2016లో బౌలింగ్‌ వేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 1.4 ఓవర్లు వేసి.. 15 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. వీటిలో 4 బంతులు డాట్‌కాగా 1 ఫోర్‌, 1 సిక్స్‌ ఇచ్చాడు. ఇక వైట్‌ బాల్‌ క్రికెట్‌ విషయానికొస్తే కోహ్లి చివరిసారి 2017లో శ్రీలంకంతో జరిగిన వన్డే మ్యాచ్‌లో బౌలింగ్ వేశాడు.

ఇవి కూడా చదవండి

కోహ్లీ బౌలింగ్ వీడియో..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us