ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కింగ్ కోహ్లీ వచ్చేస్తున్నాడు.. బరిలోకి దిగేది అప్పుడే.!

|

Feb 13, 2024 | 2:24 PM

భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ అంటేనే.. కచ్చితంగా టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచమంతా కూడా విరాట్ కోహ్లీ కోసం క్యూ కట్టేస్తారు. అది కూడా ఇంగ్లీష్ క్రికెట్ కొత్తగా టెస్టుల్లోకి 'బజ్‌బాల్' తీసుకురావడంతో.. కోహ్లీ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలని..

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కింగ్ కోహ్లీ వచ్చేస్తున్నాడు.. బరిలోకి దిగేది అప్పుడే.!
Virat Kohli Ind Vs Eng
Follow us on

భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ అంటేనే.. కచ్చితంగా టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచమంతా కూడా విరాట్ కోహ్లీ కోసం క్యూ కట్టేస్తారు. అది కూడా ఇంగ్లీష్ క్రికెట్ కొత్తగా టెస్టుల్లోకి ‘బజ్‌బాల్’ తీసుకురావడంతో.. కోహ్లీ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలని కోరుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇక రెండు టెస్టులు ముగిసేసరికి 1-1తో సమయంతో ఉన్నాయి రెండు జట్లు. రెండు రోజుల్లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. జట్టు ప్రకటన కూడా వచ్చేసింది. కోహ్లీ అందుబాటులోకి వస్తాడనుకుంటే.. పర్సనల్ రీజన్స్ వల్ల దూరంగా ఉన్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే కోహ్లీ గోప్యతకు భంగం కలగకుండా.. అతడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు.

సెలక్షన్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో.. అతడిపై అనేక వదంతులు ఇంటర్నెట్‌లో హల్చల్ చేశాయి. కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాలేదని కొందరు అంటే..? అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అని మరికొందరు..? కోహ్లీ ఏదో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ఇంకొందరు.? నెట్టింట రూమర్స్ సృష్టించారు. దీంతో అసలు కోహ్లీ కుటుంబంలో ఏం జరుగుతోందో అర్ధం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌ అందరికీ ఓ గుడ్ న్యూస్ వినిపించాడు బీసీసీఐ అధికారి. ధర్మశాల టెస్టు‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని.. జట్టులోకి తిరిగి వస్తాడని సదరు బీసీసీఐ అధికారి.. పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో మరికొద్ది రోజుల్లోనే కింగ్ కోహ్లీ బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కాగా, ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత రాంచిలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్ట్, ధర్మశాల వేదిక మార్చి 7 నుంచి ఐదో టెస్టు ఆరంభం కానుంది.