Unique Record: టీ20 వరల్డ్ కప్‌ హిస్టరీలో అరుదైన సీన్.. ఒకే ప్రపంచ రికార్డ్ సృష్టించిన బెస్ట్ ఫ్రెండ్స్..!

T20 World Cup 2026 Unique Record: టీ20 వరల్డ్ కప్ 2026లో ఒక అరుదైన రికార్డ్ నమోదైంది. భారత్ ఆటగాడు తిలక్ వర్మ, దక్షిణాఫ్రికా స్టార్ డివాల్డ్ బ్రేవిస్ ఇద్దరూ ఒకే రికార్డ్ సృష్టించారు. ఇలా చేయడం క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం గమానార్హం. ఆవివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

Unique Record: టీ20 వరల్డ్ కప్‌ హిస్టరీలో అరుదైన సీన్.. ఒకే ప్రపంచ రికార్డ్ సృష్టించిన బెస్ట్ ఫ్రెండ్స్..!
Tilak Varma Dewald Brevis World Record

Updated on: Mar 10, 2026 | 10:28 AM

T20 World Cup 2026 Unique Record: ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) లో ఈసారి అనేక ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. అయితే, అందులో ప్రత్యేకంగా నిలిచిన ఒక అరుదైన ఘనత ఇద్దరు స్నేహితుల పేర మీద నమోదైంది. తిలక్ వర్మ (Tilak Varma), డేవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) ఇద్దరూ ఒకే విధమైన ప్రపంచ రికార్డును సృష్టించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ దేశాల కోసం ఆడుతూ ఒకే విధమైన గణాంకాలతో టోర్నమెంట్ ముగించారు. ఈ సంఘటన టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మొదటిసారి జరిగింది.

అర్ధశతకం లేకుండా 200+ పరుగులు..

తిలక్ వర్మ, బ్రేవిస్ ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ 2026లో అర్ధశతకం నమోదు చేయకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు అయ్యారు.

ఒకే రికార్డులో ఇద్దరూ..

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ అర్ధశతకం చేయకుండా 200కి పైగా పరుగులు చేయలేదు. కానీ, ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు అదే రికార్డును సృష్టించారు. ఇది క్రికెట్ ప్రపంచంలో ఒక అరుదైన రికార్డ్‌గా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

బద్దలైన పాత రికార్డ్..

ఇంతకుముందు ఈ రికార్డు అనముల్ హక్యూ (Anamul Haque) పేర మీద ఉండేది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో ఆయన అర్ధశతకం లేకుండా 184 పరుగులు చేశారు. ఇప్పుడు తిలక్ వర్మ, బ్రేవిస్ ఇద్దరూ 207 పరుగులతో ఆ రికార్డును దాటేశారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ ఇద్దరూ తమ మొదటి టీ20 వరల్డ్ కప్ లోనే ఈ ఘనత సాధించారు.

ఇద్దరి మధ్య స్నేహం..

తిలక్ వర్మ, బ్రేవిస్ మధ్య స్నేహం ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. బ్రేవిస్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో ఆడుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

అతను మాట్లాడుతూ తిలక్ వర్మతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతామని, ఇద్దరూ మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే వరల్డ్ రికార్డ్ సృష్టించడం క్రికెట్ అభిమానులను మరింత ఆకట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us