India’s Record in Boxing Day Tests: డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ మరుసటి రోజున, ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టును నిర్వహిస్తుంది. ఈసారి ఆస్ట్రేలియా టీమ్ ఇండియాతో పోటీపడనుంది. బాక్సింగ్ డే టెస్ట్ చరిత్ర 1950 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. 1985 నుంచి బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా భాగమైంది. టీమ్ ఇండియా బాక్సింగ్ డే టెస్టు రికార్డును ఒకసారి చూద్దాం. బాక్సింగ్ డే టెస్టులో ఇప్పటివరకు ఏ భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం..
1985లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి బాక్సింగ్ డే టెస్టు ఆడింది. ఈ మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత 1987లో కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టు కూడా డ్రాగా ముగిసింది. టీమిండియా ఇప్పటి వరకు వివిధ దేశాలతో 22 బాక్సింగ్ డే టెస్టులు ఆడింది. ఇందులో 4 గెలిచి, 6 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. మిగతా 12 సార్లు ఓటమిపాలైంది.
బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించేందుకు టీమిండియా 25 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో, 2021, 2024లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కూడా భారత జట్టు ఆఫ్రికాను ఓడించింది. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించింది. 2018లో మెల్‌బోర్న్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియాపై భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత, 2020లో మెల్‌బోర్న్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఇరు జట్లు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్టులో తలపడనున్నాయి.
బాక్సింగ్ డే టెస్టులో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో చాలా మంది పెద్ద పేర్లు ఉన్నాయి.
1987లో వెస్టిండీస్‌పై దిలీప్ వెంగ్‌సర్కర్
1992లో న్యూజిలాండ్‌పై కపిల్ దేవ్
1998లో న్యూజిలాండ్‌పై మహ్మద్ అజారుద్దీన్
1998లో న్యూజిలాండ్‌పై సచిన్ టెండూల్కర్
1999లో ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్
2003లో ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్
2014లో ఆస్ట్రేలియాపై అజింక్య రహానే
2020లో ఆస్ట్రేలియాపై చెతేశ్వర్ పుజారా
2018లో ఆస్ట్రేలియాపై చెతేశ్వర్ పుజారా
2021లో దక్షిణాఫ్రికాపై కేఎల్ రాహుల్ సెంచరీలు చేశారు.
నం. | సంవత్సరం | ప్రత్యర్థి | వేదిక | ఫలితం |
1 | 1967 | ఆస్ట్రేలియా | అడిలైడ్ | 146 పరుగుల తేడాతో ఓడిపోయింది |
2 | 1979 | పాకిస్తాన్ | కాన్పూర్ | డ్రా |
3 | 1981 | ఇంగ్లండ్ | ఢిల్లీ | డ్రా |
4 | 1983 | వెస్టిండీస్ | చెన్నై | డ్రా |
5 | 1987 | వెస్టిండీస్ | కోల్‌కతా | డ్రా |
6 | 1985 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | డ్రా |
7 | 1991 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 8 వికెట్ల తేడాతో ఓటమి |
8 | 1992 | దక్షిణాఫ్రికా | గెబెర్హా | 9 వికెట్ల తేడాతో ఓటమి |
9 | 1996 | దక్షిణాఫ్రికా | డర్బన్ | 328 పరుగుల తేడాతో ఓటమి |
10 | 1998 | న్యూజిలాండ్ | వెల్లింగ్టన్ | 4 వికెట్ల తేడాతో ఓటమి |
11 | 1999 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 180 పరుగుల తేడాతో ఓటమి |
12 | 2003 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 9 వికెట్ల తేడాతో ఓటమి |
13 | 2006 | దక్షిణాఫ్రికా | డర్బన్ | 174 పరుగుల తేడాతో ఓటమి |
14 | 2007 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 337 పరుగుల తేడాతో ఓటమి |
15 | 2010 | దక్షిణాఫ్రికా | డర్బన్ | 87 పరుగుల తేడాతో విజయం |
16 | 2011 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 122 పరుగుల తేడాతో ఓటమి |
17 | 2013 | దక్షిణాఫ్రికా | డర్బన్ | 10 వికెట్ల తేడాతో ఓటమి |
18 | 2014 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | డ్రా |
19 | 2018 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 137 పరుగుల తేడాతో విజయం |
20 | 2020 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 8 వికెట్ల తేడాతో విజయం |
21 | 2021 | దక్షిణాఫ్రికా | సెంచూరియన్ | 113 పరుగుల తేడాతో విజయం |
22 | 2023 | దక్షిణాఫ్రికా | సెంచూరియన్ | ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..