HBD Harbhajan Singh: బ్యాట్స్‌మెన్ కావాలని స్పిన్నర్‌గా మారాడు.. హర్భజన్ సింగ్ జీవితంలో ఆసక్తికర మలుపులు..

|

Jul 03, 2023 | 1:58 PM

Harbhajan Singh Birthday: భారత క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఈరోజు తన 43వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో హర్భజన్ సింగ్ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌గా పేరుగాంచాడు.

HBD Harbhajan Singh: బ్యాట్స్‌మెన్ కావాలని స్పిన్నర్‌గా మారాడు.. హర్భజన్ సింగ్ జీవితంలో ఆసక్తికర మలుపులు..
Harbhajan Singh Birthday
Follow us on

Harbhajan Singh Birthday: భారత క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఈరోజు తన 43వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో హర్భజన్ సింగ్ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌గా పేరుగాంచాడు. హర్భజన్ సింగ్ జులై 3న జలంధర్‌లో జన్మించాడు. తన కుటుంబాన్ని చూసుకోవడానికి భజ్జీ మొదట ట్రక్ డ్రైవర్ కావాలని అనుకున్నాడు. కానీ, తన సోదరీమణుల కారణంగా అతను క్రికెటర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు.

హర్భజన్ సింగ్ జీవితంలో అతను కూడా చాలా బాధలను ఎదుర్కోవలసి వచ్చింది. భజ్జీకి 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి మరణించాడు. కుటుంబ బాధ్యత మొత్తాన్ని అతని భుజాలపై వేసుకున్నాడు. భజ్జీ పట్టు వదలకుండా దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాలో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. భజ్జీ మొదట బ్యాట్స్‌మెన్ కావాలనుకున్నాడు. కానీ, కోచ్ సలహా తర్వాత అతను ఆఫ్ స్పిన్నర్ కావాలని నిర్ణయించుకున్నాడు.

ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్‌తో అరుదైన ఫీట్..

టెస్టు క్రికెట్‌లో భారత్ నుంచి తొలి హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడు హర్భజన్ సింగ్. అతను 2001లో కోల్‌కతా టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై రికీ పాంటింగ్, షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ల వికెట్లు తీశాడు. ఆ టెస్టు సిరీస్‌లో హర్భజన్ సింగ్ భారత జట్టు నుంచి అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

T20, ODI ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా..

2007లో భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు హర్భజన్‌ సింగ్‌ బంతితో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో, హర్భజన్ సింగ్ కూడా 2011 ODI ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో హర్భజన్ సింగ్ 103 టెస్టు మ్యాచ్‌ల్లో 417 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో, అతను ఒక ఇన్నింగ్స్‌లో 25 సార్లు 5 వికెట్లు, ఒక మ్యాచ్‌లో 5 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు.

టెస్టు ఫార్మాట్‌లో హర్భజన్ సింగ్ పేరిట 2 సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డు కూడా ఉంది. భజ్జీ 236 వన్డేల్లో 269 వికెట్లు తీయగా, 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో కూడా హర్భజన్ సింగ్ రికార్డు ఆకట్టుకుంటుంది. భజ్జీ 163 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్ ముంబై , చెన్నైతరపున ఆడిన సమయంలో IPL విజేత జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..