
T20 World Cup 2026 Semifinal Schedule: భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోన్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఇప్పుడు నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్, సూపర్-8 దశల్లో ఉత్కంఠభరిత పోటీ అనంతరం నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ ముందంజ వేయగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చివరి నాలుగులో స్థానం దక్కించుకున్నాయి.
సెమీఫైనల్ మ్యాచ్‌లు చారిత్రాత్మక వేదికల్లో రాత్రి వేళల్లో జరగనున్నాయి. వర్షం వంటి పరిస్థితుల కోసం రిజర్వ్ డే కూడా అందుబాటులో ఉంది. సెమీస్ లో విజేతలుగా నిలిచిన రెండు జట్లు మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరులో తలపడనున్నాయి.
టోర్నమెంట్ ప్రారంభంలో నాలుగు గ్రూపులుగా 20 జట్లు పోటీపడ్డాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్-8 దశకు చేరుకున్నాయి. సూపర్-8 దశలో రెండు గ్రూపులుగా నాలుగు జట్లు చొప్పున విభజించి, ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. గ్రూప్ దశలో సహ అర్హత జట్లపై సాధించిన పాయింట్లు కూడా తీసుకువచ్చారు. ఈ దశలో శ్రీలంక, పాకిస్థాన్ గ్రూప్-2 నుంచి ఎలిమినేట్ కాగా, వెస్టిండీస్, జింబాబ్వే కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
1వ సెమీఫైనల్..
న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా
కోల్‌కతా
బుధవారం, మార్చి 4
2వ సెమీఫైనల్..
భారత్ vs ఇంగ్లాండ్
ముంబై
గురువారం, మార్చి 5
ఈ రెండు హై-వోల్టేజ్ పోరుల్లో గెలిచిన జట్లు మార్చి 8న ఫైనల్‌లో తలపడతాయి.
టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..