Nitish Kumar Reddy : క్రికెట్ గ్రౌండ్‌లో ‘మహేశ్ బాబు’ నేనే.. నితీశ్ రెడ్డి వైరల్ కామెంట్స్ వెనుక అసలు కథ ఇదే

Nitish Kumar Reddy : ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఆంధ్ర కుర్రాడు, తాజాగా తన కలల కారును సొంతం చేసుకోవడమే కాకుండా టాలీవుడ్ హీరోలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును తనతో పోల్చుకుంటూ నితీశ్ చెప్పిన మాటలు అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.

Nitish Kumar Reddy : క్రికెట్ గ్రౌండ్‌లో మహేశ్ బాబు నేనే.. నితీశ్ రెడ్డి వైరల్ కామెంట్స్ వెనుక అసలు కథ ఇదే
Nitish Kumar Reddy

Updated on: May 06, 2026 | 9:52 AM

Nitish Kumar Reddy : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆల్‌రౌండర్, టీమిండియా యువ కెరటం నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అటు క్రికెట్ గ్రౌండ్‌లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యాడు. ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఆంధ్ర కుర్రాడు, తాజాగా తన కలల కారును సొంతం చేసుకోవడమే కాకుండా టాలీవుడ్ హీరోలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును తనతో పోల్చుకుంటూ నితీశ్ చెప్పిన మాటలు అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.

హీరోలపై నితీశ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నితీశ్ కుమార్ రెడ్డికి సినిమాలంటే ఎంత ఇష్టమో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడైంది. మన టాలీవుడ్ స్టార్ హీరోలకు, క్రికెటర్లకు మధ్య ఉన్న పోలికలను ఆయన వివరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

పవన్ కళ్యాణ్ – గౌతమ్ గంభీర్: పవన్ కళ్యాణ్‌లోని దూకుడు, ఆటిట్యూడ్ గంభీర్‌లా ఉంటుందని పోల్చాడు.

ప్రభాస్ – శివం దూబే: భారీ కాయం, పవర్‌ఫుల్ హిట్టింగ్ కలిగిన ప్రభాస్‌ను శివం దూబేతో పోల్చాడు.

అల్లు అర్జున్ – శుభ్‌మన్ గిల్ : స్టైలిష్ స్టార్‌ను క్రికెట్ స్టైలిష్ ప్లేయర్ గిల్‌తో కంపేర్ చేశాడు.

Jr.NTR – ఇషాన్ కిషన్: తారక్ స్పీడ్, ఎనర్జీ ఇషాన్ కిషన్ లా ఉంటుందని చెప్పాడు.

రామ్ చరణ్ – శ్రేయస్ అయ్యర్: గ్లోబల్ స్టార్‌ను శ్రేయస్ అయ్యర్‌తో పోల్చాడు.

మహేశ్ బాబు – నితీశ్ కుమార్ రెడ్డి: ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబును మాత్రం ఎవరితోనూ పోల్చకుండా, “నేనే మహేశ్ బాబు” అంటూ తనతోనే కంపేర్ చేసుకున్నాడు. తాను మహేశ్ బాబుకు వీరాభిమానిని కాబట్టే ఇలా అన్నానని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

కలల కారు రేంజ్ రోవర్ సొంతం

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచిన నితీశ్ రెడ్డి, ఆ తర్వాత టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. తన కష్టార్జితంతో తాజాగా రూ.3.83 కోట్ల నుంచి రూ.4.83 కోట్ల వరకు ధర ఉండే లగ్జరీ రేంజ్ రోవర్ (Range Rover) కారును కొనుగోలు చేశాడు. కారు కొన్న వెంటనే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తన ఎదుగుదలలో అండగా నిలిచిన తల్లిదండ్రులను, సోదరిని అదే కారులో ఎక్కించుకుని నగర వీధుల్లో చక్కర్లు కొట్టాడు.

మహేశ్ బాబుతో పోలిక – గోల్డెన్ షేడ్ కారు

నితీశ్ రెడ్డి ఈ కారును ఎంచుకోవడం వెనుక కూడా మహేశ్ బాబుపై ఉన్న అభిమానమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు కూడా అదే గోల్డెన్ కలర్ (సిమిలర్ షేడ్) రేంజ్ రోవర్ కారును వాడుతున్నారు. తన ఫేవరెట్ హీరో వాడుతున్న మోడల్, అదే కలర్ కారును నితీశ్ కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “మహేశ్ బాబు సినిమాలో ఎంత స్టైలిష్‌గా ఉంటారో, నితీశ్ కూడా గ్రౌండ్‌లో అంతే స్టైలిష్‌గా కనిపిస్తారు” అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us