Video: గాల్లో ఎగురుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. లంకకు షాకిచ్చిన టీమిండియా కెప్టెన్..!

Shubman Gill Catch: కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, మైదానంలో ఇలాంటి అసాధారణ ఫీల్డింగ్‌తో సహచరుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాడు శుభ్మన్ గిల్. ఈ కళ్లుచెదిరే ఫీల్డింగ్ ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Video: గాల్లో ఎగురుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్.. లంకకు షాకిచ్చిన టీమిండియా కెప్టెన్..!
Shubman Gill Catch

Updated on: Aug 17, 2026 | 1:29 PM

Shubman Gill Catch: గాలె టెస్టులో టీమిండియా సారథి శుభ్‌మన్ గిల్ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టి, మైదానంలో అందరికీ షాకిచ్చాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సమయంలో కుల్‌దీప్ యాదవ్ వేసిన బంతిని కమిందు మెండిస్ ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా గాల్లోకి లేపాడు. బంతి కాస్త దూరంగా వెళ్తుండటంతో అది ఖచ్చితంగా బౌండరీకి చేరుతుందని అందరూ భావించారు. కానీ, అదే సమయంలో కవర్స్ వద్ద నిల్చున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెరుపు వేగంతో తన ఎడమ వైపునకు గాల్లోకి డైవ్ చేశాడు. ఒంటిచేత్తో ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టి ఆశ్చర్యపరిచాడు. గిల్ చేసిన ఈ సూపర్ మ్యాన్ ఫీట్ చూసి బ్యాటర్ కమిందు మెండిస్ కూడా నమ్మలేకపోయాడు.

ఎక్కువమంది చదివినది: 2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..?

ఇవి కూడా చదవండి

చరిత్ర సృష్టిస్తున్న ఫీల్డింగ్ గణాంకాలు..

ఈ క్యాచ్‌తో భారత సారథి సరికొత్త మైలురాళ్లను అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో గిల్‌కు ఇది 32వ క్యాచ్ కాగా, కెప్టెన్‌గా 10 మ్యాచ్‌ల్లోనే 7 క్యాచ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా చురుకైన ఫీల్డర్‌గా పేరున్న గిల్, వన్డేల్లో 40, పొట్టి క్రికెట్‌లో 9 క్యాచ్‌లు అందుకున్నాడు. భారత టెస్టు కెప్టెన్ల జాబితాలో దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని 187 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 71 క్యాచ్‌లు, మహ్మద్ అజహరుద్దీన్ 50 క్యాచ్‌లు, సునీల్ గవాస్కర్ 45 క్యాచ్‌లు, సౌరవ్ గంగూలీ 37 క్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఎక్కువమంది చదివినది: Asia Cup 2026: ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే.. పూర్తి వివరాలు ఇవిగో..!

పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక జట్టు..

గిల్ పట్టిన ఈ అద్భుత క్యాచ్ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేసింది. అంతకుముందే నిషాన్ మదుష్క, లహిరు ఉదార, దినేష్ చండిమాల్ పెవిలియన్ చేరగా, మెండిస్ నిష్క్రమణతో శ్రీలంక 59 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. భారత స్పిన్నర్లు లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుండటంతో మ్యాచ్‌పై పర్యాటక జట్టు పట్టు బిగించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us