IND vs AFG 2nd T20I: వైభవ్ vs శాంసన్.. మరికొద్దిసేపట్లో మ్యాచ్.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గంభీర్?
Sanju Samson vs Vaibhav Suryavanshi: సంజు శాంసన్ కారణంగా వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పిచడం పట్ల అభిమానులతో పాటు చాలా మంది మాజీ దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైభవ్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు చేస్తున్నారు. మరి గంభీర్ ఎలాంటి ప్లాన్ తో బరిలోకి దిగనున్నాడు, వైభవ్ కి మరోసారి హ్యాండిస్తారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..!

Sanju Samson vs Vaibhav Suryavanshi: ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో జరుగుతోన్న టీ20 సిరీస్ లో నేడు రెండో మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే, తొలి మ్యాచ్ లో సంజూ శాంసన్ విఫలమవ్వడంతో మరోసారి ఓపెనింగ్ జోడీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఓపెనర్ గా సంజూని తప్పించాలని డిమాండ్లు మొదలయ్యాయి. టీమిండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరి రెండో మ్యాచ్ లో ఎలాంటి ఓపెనింగ్ జోడీతో భారత జట్టు బరిలోకి దిగనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 38 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, 3 మ్యాచ్ ల సిరీస్ ను ఘనంగా ప్రారంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం భారత్ 13.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టపోయి టార్గెట్ అందుకుంది.
ఇక సిరీస్‌లోని రెండవ టీ20 మ్యాచ్ నేడు అంటే సెప్టెంబర్ 15న ఢిల్లీలో జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనింగ్ జోడీలో మార్పు చోటుచేసుకోవచ్చు. సంజు సామ్సన్‌కు బదులుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. సంజు పేలవ ఫామ్‌లో ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. మరోవైపు సంజూకి మరో ఛాన్స్ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ ఆలోచిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. టాస్ పడగానే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
తొలి టీ20లో పేలవ ఆరంభం..
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఈజీగా విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తొలి వికెట్ మాత్రం చాలా త్వరగా కోల్పోవడం ఆందోళనగా మారింది. 3వ ఓవర్‌లో 18 పరుగుల వద్ద సంజు సామ్సన్ అవుటవడంతో భారత్ తొలి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సంజూ శాంసన్ మరోసారి విఫలమవ్వడంతో విమర్శలు వస్తున్నాయి.
ఛాన్స్ సద్వినియోగం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్..
జింబాబ్వే టూర్ కు దూరమైన సంజు శాంసన్, ఆఫ్ఘాన్ సిరీస్ కోసం భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా ఆడే అవకాశాన్ని పొందాడు. అయితే, ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2 ఫోర్ల సహాయంతో 8 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ కారణంగా 2వ టీ20లో సంజు మళ్లీ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడనే ఆశలు పెద్దగా లేవనిపిస్తోంది. మరోవైపు గంభీర్ వేరే ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. విఫలమైనా ఈ ఛాంపియన్ ప్లేయర్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారా..?
జింబాబ్వేలో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ 2 హాఫ్ సెంచరీల సహాయంతో 151 పరుగులు సాధించాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు అతను దూరమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ కు ఛాన్స్ ఇచ్చి, వైభవ్‌ను తుది జట్టు నుంచి తొలగించారు. 2వ మ్యాచ్ లోనూ ఇదే కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




