Sanju Samson : బాబోయ్ సంజూ క్రేజ్ మామూలుగా లేదుగా..బోణీ కొట్టకపోయినా జట్టులో చోటు పక్కా అట

Sanju Samson : న్యూజిలాండ్‌తో జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. కానీ మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సంజూకు అండగా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఒకటి రెండు మ్యాచ్‌ల వైఫల్యాల ఆధారంగా ఒక ఆటగాడిని తీసేయకూడదని, సంజూ లాంటి మ్యాచ్ విన్నర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని రహానే కోరాడు.

Sanju Samson : బాబోయ్ సంజూ క్రేజ్ మామూలుగా లేదుగా..బోణీ కొట్టకపోయినా జట్టులో చోటు పక్కా అట
Sanju Samson

Updated on: Jan 27, 2026 | 10:43 AM

Sanju Samson : టీమిండియా గెలుపుల జోరు మీద ఉన్నప్పటికీ, జట్టులో ప్లేయింగ్ ఎలెవన్ కూర్పు మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. కానీ ఓపెనర్ సంజూ శాంసన్ వరుస వైఫల్యాలు ఇప్పుడు అభిమానులను, విశ్లేషకులను రెండు వర్గాలుగా చీల్చేశాయి. ఒకపక్క ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతుంటే, మరోపక్క సంజూ వరుసగా డకౌట్లు, తక్కువ స్కోర్లకే పరిమితమవుతున్నాడు. అయితే సంజూకు టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి గట్టి మద్దతు లభిస్తుండటం విశేషం.

న్యూజిలాండ్‌తో జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. కానీ మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సంజూకు అండగా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఒకటి రెండు మ్యాచ్‌ల వైఫల్యాల ఆధారంగా ఒక ఆటగాడిని తీసేయకూడదని, సంజూ లాంటి మ్యాచ్ విన్నర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని రహానే కోరాడు. సంజూ క్రీజులో కుదురుకుంటే ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో అందరికీ తెలుసని, అందుకే అతనికి మద్దతుగా నిలవాలని సూచించాడు. రహానే అభిప్రాయం ప్రకారం..నాలుగో టీ20లో తిలక్ వర్మ జట్టులోకి వస్తే, ఇషాన్ కిషన్ మీద వేటు పడే అవకాశం ఉంది.

జనవరి 28న విశాఖపట్నం వేదికగా జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ సంజూ శాంసన్ కెరీర్‌కు అత్యంత కీలకం కానుంది. వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసే సమయం దగ్గర పడుతుండటంతో, ఈ మ్యాచ్‌లో సంజూ భారీ స్కోరు సాధించాల్సిందే. ఒకవేళ ఇక్కడ కూడా విఫలమైతే, మేనేజ్‌మెంట్ ఇక రిస్క్ తీసుకోకుండా ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇషాన్ కిషన్ గత మ్యాచ్‌లో 13 బంతుల్లో 28 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయినప్పటికీ రహానే వంటి సీనియర్లు సంజూకు మద్దతు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజానికి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా మంచి రికార్డు కలిగి ఉన్నాడు. కానీ సంజూ శాంసన్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్, అతని హిట్టింగ్ సామర్థ్యం అతనికి ప్లస్ అవుతున్నాయి. నాలుగో టీ20లో టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయోగాల బాట పడితే, సీనియర్ల సూచనల మేరకు ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టి సంజూ-శుభ్‌మన్ గిల్‌లతో ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది. మరి వైజాగ్ స్టేడియంలో సంజూ తన బ్యాట్‌తో సమాధానం చెబుతాడో లేదో వేచి చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..