Jasprit Bumrah: బుమ్రాను కాపాడుకోవాలి.. మూడు ఫార్మాట్లు ఆడించొద్దు.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్‌పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమయ్యే క్రమంలో టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. భువనేశ్వర్ కుమార్ అనుభవాన్ని ప్రశంసిస్తూ, మహమ్మద్ షమీకి కూడా అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

Jasprit Bumrah: బుమ్రాను కాపాడుకోవాలి.. మూడు ఫార్మాట్లు ఆడించొద్దు.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah

Updated on: Oct 19, 2026 | 4:00 PM

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతి మ్యాచ్‌లోనూ బుమ్రా ఆడటం అసాధ్యంగా మారుతోంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఒక కీలక సూచన చేశారు. బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ ఆడి తన శరీరాన్ని అలసటలోకి నెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంపిక చేసిన మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని సూచించారు.

న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌పై దృష్టి

వచ్చే న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. రవిశాస్త్రి అభిప్రాయం ప్రకారం.. కివీస్ గడ్డపై జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం బుమ్రాను రిజర్వ్ చేసి ఉంచడం జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు అలాగే సుదీర్ఘ సిరీస్‌ల వల్ల బౌలర్లపై పనిభారం విపరీతంగా పెరుగుతుంది. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ తగిన విశ్రాంతినిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: IND vs NZ: భారత్ వర్సెస్ కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్ ?

భువీ రీఎంట్రీ పై శాస్త్రీ ఏమన్నాడంటే

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించి రవిశాస్త్రి ప్రత్యేకంగా మాట్లాడారు. క్రికెట్‌లో అనుభవాన్ని ఏదీ భర్తీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో భువి ప్రదర్శించిన అద్భుతమైన ఫామ్ న్యూజిలాండ్ పిచ్‌లపై టీమిండియాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. పరిస్థితులకు తగ్గట్టుగా బంతులను స్వింగ్ చేయగల కెపాసిటీ ఉన్న భువనేశ్వర్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ జట్టులో ఉండటం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: IND vs NZ: సూర్య రికార్డు బద్దలవుతుందా? అభిషేక్, ఇషాన్ ముందున్న భారీ టార్గెట్ ఇదే

మహమ్మద్ షమీ రీఎంట్రీపై చర్చ

గాయం నుంచి కోలుకుని దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న మహమ్మద్ షమీ రీఎంట్రీ గురించి కూడా రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గతంలో టెస్టులు అలాగే వన్డేలలో షమీ అందించిన అద్భుతమైన సేవలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దేశవాళీ మ్యాచ్‌లలో నిరూపించుకుంటున్న ఆయనను వీలైనంత త్వరగా భారత వన్డే అలాగే టెస్ట్ జట్లలోకి తిరిగి తీసుకోవాలని సూచించారు. సీనియర్ ఆటగాళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే ఐసీసీ టోర్నీలలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us