RCB vs PBKS: ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరవ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. పంజాబ్ తరపున కెప్టెన్ శిఖర్ ధావన్ అత్యధిక పరుగులు చేశాడు. అతను 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జితేష్ శర్మ 27 పరుగులతో, సామ్ కరెన్ 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 8 బంతుల్లో అజేయంగా 21 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ తరపున మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ తలో 2 వికెట్లు తీశారు.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం లభించింది. సామ్ కుర్రాన్ వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లీ 4 ఫోర్లు బాదాడు. RCB ఇన్నింగ్స్ రెండో బంతికే విరాట్ అందించిన క్యాచ్‌ను జానీ బెయిర్‌స్టో మిస్ చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టానికి 50 పరుగులు చేసింది. కోహ్లీ 15 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 650 ఫోర్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Innings Break!
20 runs from the final over powers @PunjabKingsIPL to 176/6 🔥
Will it be enough or @RCBTweets will chase this down?
Scorecard ▶️ https://t.co/cmauIj3e0o#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/QdlgTDD2vk
— IndianPremierLeague (@IPL) March 25, 2024
ఇరుజట్ల ప్లేయింగ్ 11
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) , విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, యశ్ దయాల్ మరియు మహ్మద్ సిరాజ్.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్) , జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ మరియు రాహుల్ చాహర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..