టీమిండియాలో సడన్ ఎంట్రీ.. అసలెవరీ నచికేత్ భూటే.. అసలేంటి ఇతగాడి ట్యాలెంట్..?
Nachiket Bhute India A Squad: ఆస్ట్రేలియా Aతో జరగనున్న మల్టీడే సిరీస్‌కు భారత్ A జట్టులో విదర్భ ఆల్‌రౌండర్ నచికేత్ భూటేకు చోటు దక్కింది. నాగ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల భూటే కుడిచేతి మీడియం పేసర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. గత రంజీ సీజన్‌లో 29 వికెట్లు తీసి విదర్భ తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

Nachiket Bhute India A Squad: ఆస్ట్రేలియా Aతో జరగనున్న మల్టీడే మ్యాచ్‌ల కోసం ప్రకటించిన భారత్ A జట్టులో నచికేత్ భూటే పేరు ఆసక్తి రేపుతోంది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరిలో సిరీస్ మొదలుకానుంది. రెండు మల్టీడే, మూడు వన్డే మ్యాచ్‌లతో ఈ పర్యటన సాగనుంది. మల్టీడే జట్టులో చోటు దక్కించుకున్న భూటే ఇప్పటివరకు విదర్భ దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. నాగ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల భూటే బౌలింగ్ ఆల్ రౌండర్ (bowling all-rounder). కుడిచేతి మీడియం పేస్‌తో బంతిని సరైన లైన్, లెంగ్త్‌లో వేయడమే అతడి ప్రధాన బలం. కొత్త బంతితో పిచ్‌పై నుంచి కదలిక రాబట్టడంతో పాటు గాల్లోనూ మూవ్‌మెంట్ సృష్టించగలడు.
బ్యాటింగ్‌లో కుడిచేతి వాటం కలిగిన భూటే సాధారణంగా 7 లేదా 8 స్థానాల్లో వస్తాడు. అవసరమైన సమయంలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం ఉంది. రెడ్ బాల్ క్రికెట్‌లో బ్యాట్‌తోనూ ఉపయోగకరమైన సహకారం అందించిన సందర్భాలు ఉన్నాయి.
విధర్బతో మొదలు..
విదర్భ క్రికెట్‌తో భూటేకు దాదాపు దశాబ్ద కాలంగా అనుబంధం ఉంది. 2018-19లో విన్నో మన్కడ్ ట్రోఫీ (Vinoo Mankad Trophy) గెలిచిన విదర్భ U19 జట్టులో అతడు సభ్యుడు. ఆ తర్వాత U23 స్థాయిలోనూ కొనసాగాడు.
2019-20 సీకే నాయుడు ట్రోఫీ (CK Nayudu Trophy)లో విదర్భ టైటిల్ సాధించడంలో భూటే కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్ సగటు 22.12గా ఉంది. అదే సమయంలో బ్యాట్‌తోనూ జట్టుకు ఉపయోగపడే పరుగులు చేశాడు.
రంజీలో 29 వికెట్ల ప్రదర్శన..
సీనియర్ స్థాయిలో భూటే 2021లో సయ్యద్ మస్తాక్ ఆలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) ద్వారా విదర్భకు అరంగేట్రం చేశాడు. అనంతరం లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ ఆడాడు. ఇప్పటివరకు 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్ సగటు 25.38, స్ట్రైక్‌రేట్ 52.2గా ఉంది.
ముఖ్యంగా రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2025-26 సీజన్ భూటేకు బాగా కలిసొచ్చింది. 29 వికెట్లతో విదర్భ తరఫున ఆ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కొత్త బంతితోనే కాకుండా పాత బంతితోనూ ప్రభావం చూపించాడు.
బ్యాట్‌తోనూ విలువైన పరుగులు..
గత రంజీ సీజన్‌లో భూటే బంతితో పాటు బ్యాట్‌తోనూ తన సత్తా చాటాడు. 196 పరుగులు, 39.2 సగటుతో సాధించాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 29 వికెట్లు, బ్యాటింగ్‌లో ఉపయోగకరమైన పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఇండియా ఏ (India A)లో అవకాశం దక్కేందుకు బలమైన కారణంగా నిలిచింది.
భారత్ A మల్టీడే జట్టులో భూటే ఎంపికతో దేశవాళీ స్థాయిలో రెండు విభాగాల్లోనూ ప్రభావం చూపుతున్న ఆటగాడికి అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా Aతో పుదుచ్చేరిలో జరిగే మ్యాచ్‌లు అతడి తదుపరి అడుగుకు కీలక వేదికగా మారనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




