AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని ఫ్యాన్స్‌కు ఆ హోటల్‌లో బిల్లు ఉండదు..!

మహేంద్రసింగ్ ధోని… ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. భారత్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన ఈ మిస్టర్ కూల్.. దేశానికి ఎంతో పేరు తెచ్చిపెట్టాడు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ధోనిని కామెంట్ చేశాడని ఏకంగా సచిన్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు. అంతటి డై హార్డ్ ఫ్యాన్స్ ధోనికి ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఓ అభిమాని ధోనిపై ఉన్న అభిమానంతో ధోని అభిమానుల ఆకలి బాధను తీరుస్తున్నాడు. పశ్చిమ […]

ధోని ఫ్యాన్స్‌కు ఆ హోటల్‌లో బిల్లు ఉండదు..!
Ravi Kiran
|

Updated on: Jun 26, 2019 | 12:59 PM

Share

మహేంద్రసింగ్ ధోని… ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. భారత్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన ఈ మిస్టర్ కూల్.. దేశానికి ఎంతో పేరు తెచ్చిపెట్టాడు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ధోనిని కామెంట్ చేశాడని ఏకంగా సచిన్‌ను సైతం ట్రోల్ చేస్తున్నారు. అంతటి డై హార్డ్ ఫ్యాన్స్ ధోనికి ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఓ అభిమాని ధోనిపై ఉన్న అభిమానంతో ధోని అభిమానుల ఆకలి బాధను తీరుస్తున్నాడు.

పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్ పట్టణానికి చెందిన శంభు బోస్(32) ధోనికి వీరాభిమాని. అయితే తాను కేవలం ధోని అభిమానిని చెప్పుకుని తిరగకుండా.. ఓ మంచి పనికి పూనుకున్నాడు. అతడు ఉంటున్న పట్టణంలో ఓ హోటల్ పెట్టి ధోని అభిమానులందరికి మూడు పూటలా ఉచిత భోజనం అందించడం ప్రారంభించాడు. ఇలా సమాజ సేవ చేస్తున్న బోస్.. ఆ పట్టణంలో ఉన్న నిరుపేదలైన ధోని అభిమానులకు ఆపద్బాంధవుడైయ్యాడు.

కాగా ఈ విషయం మీడియాకు తెలియడంతో బోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. అతను చేసే పనులకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బోస్ మాత్రం ఈ సేవను ఇక్కడికే పరిమితం చేయనని.. మరికొన్ని హోటల్స్ ప్రారంభించి.. తనలాంటి ధోని అభిమానులకు మరింత సేవ చేస్తానని స్పష్టం చేశాడు.

Follow Us
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం