Most Sixes In Test: జైస్వాల్ నుంచి రజాఉల్లా వరకు.. ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన బ్యాటర్లు వీరే
Most Sixes In Test: టెస్టు క్రికెట్‌లో 1 నుంచి 11వ బ్యాటింగ్ స్థానాల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితా ఆసక్తికరంగా ఉంది. యశస్వి జైస్వాల్, వసీమ్ అక్రమ్ 12 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, రజాఉల్లా 9 సిక్సర్లతో తొమ్మిదో స్థానంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో దూకుడైన బ్యాటింగ్‌కు ఈ గణాంకాలు నిదర్శనంగా నిలిచాయి.

Most Sixes In Test: టెస్టు క్రికెట్ అనగానే డిఫెన్సివ్ ఆటాట అనుకునే రోజులు పోయాయి. ఇన్నింగ్స్ ఏదైనా సిక్సర్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు బ్యాటర్లు. 1వ స్థానం నుంచి 11వ బ్యాటింగ్ స్థానం వరకు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితా ఇప్పుడు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు రజాఉల్లా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ యువ బ్యాటర్ మొత్తం 81 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనతో డెబ్యూ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డును సమం చేయడమే కాకుండా, టెస్టుల్లో 9వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా కొత్త రికార్డు నమోదు చేశాడు.
టాప్ పొజిషన్లలో జైస్వాల్
ఇన్నింగ్స్ ప్రారంభించే ఓపెనర్లలో నంబర్-1 స్థానంలో భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ 12 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కొనే బ్యాటర్ నంబర్-1 కాగా, నాన్-స్ట్రైకర్ నంబర్-2గా పరిగణించబడతాడు. నంబర్-2 స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రెండన్ మెక్‌కలమ్ 11 సిక్సర్లతో ఉమ్మడిగా అగ్రస్థానాన్ని పంచుకుంటున్నారు. 3వ స్థానంలో శ్రీలంక బ్యాటర్ కుసల్ మెండిస్ 11 సిక్సర్లతో రికార్డు నెలకొల్పగా, 4వ స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-వుల్-హక్ 9 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్ల విధ్వంసం
నంబర్-5 స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టిల్, బ్రెండన్ మెక్‌కలమ్ 11 సిక్సర్లతో టాప్‌లో కొనసాగుతున్నారు. 6వ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 11 సిక్సర్లు బాది తన ముద్ర వేసాడు. 7వ స్థానంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 8 సిక్సర్లతో ఉండగా, 8వ పొజిషన్‌లో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ 12 సిక్సర్లు బాదడం విశేషం. మొత్తం 1 నుంచి 11 స్థానాల జాబితాలో ఒకే ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు బాదిన ఘనత యశస్వి జైస్వాల్, వసీమ్ అక్రమ్‌లకు మాత్రమే దక్కింది.
చివరి వరస బ్యాటర్ల మైలురాళ్లు
పదో స్థానంలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ 9 సిక్సర్లు బాదగా, చివరిగా 11వ స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ 5 సిక్సర్లతో రికార్డుల్లో నిలిచాడు. టెయిల్ ఎండర్లు కూడా ఈ రేంజ్‌లో సిక్సర్లు బాదడం టెస్ట్ క్రికెట్ మారుతున్న తీరుకు అద్దం పడుతోంది.
టెస్టుల్లో 1 నుంచి 11వ స్థానాల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితా:
నం.1: యశస్వి జైస్వాల్ (భారత్) – 12 సిక్సర్లు
నం.2: మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) / బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్) – 11 సిక్సర్లు
నం.3: కుసల్ మెండిస్ (శ్రీలంక) – 11 సిక్సర్లు
నం.4: ఇంజమామ్-వుల్-హక్ (పాకిస్తాన్) – 9 సిక్సర్లు
నం.5: నాథన్ ఆస్టిల్ (న్యూజిలాండ్) / బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్) – 11 సిక్సర్లు
నం.6: బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) – 11 సిక్సర్లు
నం.7: ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 8 సిక్సర్లు
నం.8: వసీమ్ అక్రమ్ (పాకిస్తాన్) – 12 సిక్సర్లు
నం.9: రజాఉల్లా (పాకిస్తాన్) – 9 సిక్సర్లు
నం.10: టిమ్ సౌథీ (న్యూజిలాండ్) – 9 సిక్సర్లు
నం.11: షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ (వెస్టిండీస్) – 5 సిక్సర్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
