AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ

IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన వేళ మహమ్మద్ సిరాజ్ వరుసగా మూడు సిక్సర్లు బాది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

IND vs SL: ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ
Mohammed Siraj
Rakesh
|

Updated on: Aug 09, 2026 | 7:27 PM

Share

IND vs SL: శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతమైన విజయం లభించింది. కొలంబోలోని ఎన్‌సీసీ మైదానంలో జరిగిన ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ ఫలితం కంటే కూడా అక్కడ వాతావరణానికి అలవాటు పడేందుకు టీమిండియా ఆటగాళ్లు దీనిని ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నారు. చివరి రోజున లంక జట్టు విసిరిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరమైన సమయంలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఊహించని రీతిలో వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు

మ్యాచ్ చివరి రోజైన ఆదివారం రోజున భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో శ్రీలంక బోర్డు ఎలెవన్ జట్టుకు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు సాధించిన శ్రీలంక-11 జట్టు, 200 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లంక ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో తొలి ఇన్నింగ్స్‌లాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో గుర్‌నూర్ బ్రార్, రవీంద్ర జడేజాలు చెరో రెండు వికెట్లు తీసి ప్రభావం చూపారు.

గిల్ – జైస్వాల్ సెంచరీ భాగస్వామ్యం

207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఈసారి ఓపెనర్లుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయని గిల్, తొలి ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే అవుటైన జైస్వాల్ ఈసారి అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత రిటైర్డ్ అవుట్‌గా వెళ్లగా, రిషబ్ పంత్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ క్రీజులో ఎక్కువ సమయం గడిపాడు. ధ్రువ్ జురెల్ నిరాశపరిచినా, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ కొద్దిసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి వైదొలిగారు.

సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్ల వినాశనం

మ్యాచ్ ముగిసే చివరి నిమిషాల్లో సారాంశ్ జైన్, గుర్‌నూర్ బ్రార్‌లతో పాటు మహమ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో టీమిండియా గెలుపునకు 16 పరుగులు కావాల్సి ఉండగా, లంక స్పిన్నర్ నువంత వేసిన బౌలింగ్‌పై సిరాజ్ పంజా విసిరాడు. వరుసగా 3 సిక్సర్లు (హ్యాట్రిక్ సిక్సర్లు) బాది మ్యాచ్‌ను ముగించాడు. కేవలం 5 బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు కొట్టిన సిరాజ్ మొత్తం 15 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి బ్యాట్‌తో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం
ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం
అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి?
అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి?
ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా?
ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా?
తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న..
తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న..
షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్?
షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్?
కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు..
కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు..
పెట్‌డాగ్‌కు గ్రాండ్ గా బర్త్ డే చేసిన హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
పెట్‌డాగ్‌కు గ్రాండ్ గా బర్త్ డే చేసిన హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
అత్తను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అల్లుడు.. చివరకు..
అత్తను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అల్లుడు.. చివరకు..
నాగ పంచమి ఎప్పుడు..? ఇంట్లోనే పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా..
నాగ పంచమి ఎప్పుడు..? ఇంట్లోనే పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా..
అభిమానులను టెన్షన్‌ పెడుతున్న అక్కినేని క్లాష్‌
అభిమానులను టెన్షన్‌ పెడుతున్న అక్కినేని క్లాష్‌