AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Record: ఇంగ్లండ్ గడ్డపై సంచలనం.. 131 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా యంగ్ స్పిన్నర్

Manav Suthar: ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన ఘనత సాధించాడు. గ్లామోర్గన్‌తో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్క పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టి 131 ఏళ్ల రికార్డును సమం చేశాడు. 1895లో టామ్ హేవార్డ్ నెలకొల్పిన ఈ అరుదైన ఫస్ట్ క్లాస్ రికార్డును సుతార్ మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు.

Cricket Record: ఇంగ్లండ్ గడ్డపై సంచలనం.. 131 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా యంగ్ స్పిన్నర్
Manav Suthar
Rakesh
|

Updated on: Sep 12, 2026 | 11:25 AM

Share

Cricket Record: ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఊహించని సంచలనం సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వికెట్లు పడగొట్టి ఏకంగా 131 సంవత్సరాల నాటి చారిత్రక రికార్డును సమం చేస్తూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. టీమిండియా తరఫున ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వార్విక్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. గ్లామోర్గన్ జట్టుతో జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో ఈ భారత బౌలర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే ఇంగ్లండ్ చేరుకున్న సుతార్, కౌంటీల్లో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పోరులో వార్విక్‌షైర్ జట్టు గ్లామోర్గన్‌ను ఇన్నింగ్స్ 257 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించడంలో సుతార్ కీలక పాత్ర పోషించాడు.

పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు

కార్డిఫ్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో గ్లామోర్గన్ తొలి ఇన్నింగ్స్ కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన మానవ్ సుతార్, తాను వేసిన మూడో బంతికి ప్రత్యర్థి బ్యాటర్ మీర్ హంజాను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌లోనూ గ్లామోర్గన్ బ్యాటర్లు క్యూ కట్టడంతో ఆ జట్టు 65 పరుగులకే ఆలౌటైంది. 24వ ఓవర్‌లో బౌలింగ్ చేపట్టిన సుతార్ తన మొదటి ఓవర్‌ను మెయిడెన్ గా వేశాడు. తర్వాతి ఓవర్‌లో క్రిస్ కుక్, జేమీ మెక్‌ఇల్రాయ్‌లను బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. మ్యాచ్ మొత్తంలో 2.3 ఓవర్లు వేసిన సుతార్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టడం విశేషం.

131 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర

ఫస్ట్ క్లాస్ క్రికెట్ సుదీర్ఘ చరిత్రలో ఒక బౌలర్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బౌలింగ్ చేసి, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు ఇంగ్లండ్‌కు చెందిన టామ్ హేవార్డ్ 1895వ సంవత్సరంలో తొలిసారి ఈ ఘనత సాధించాడు. సుదీర్ఘమైన 131 ఏళ్ల విరామం తర్వాత ఒక బౌలర్ ఈ అరుదైన రికార్డును నమోదు చేయడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

వార్విక్‌షైర్ జట్టు సంచలన విజయం

గ్లామోర్గన్ బ్యాటర్లను సుతార్ తో పాటు మిగిలిన బౌలర్లు పూర్తి స్థాయిలో కట్టడి చేయడంతో వార్విక్‌షైర్ జట్టు మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. గ్లామోర్గన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వంద పరుగులు కూడా దాటలేకపోయింది. ఈ అద్భుత ప్రదర్శనతో సుతార్ తన బౌలింగ్ ప్రావీణ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఘనంగా నిరూపించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us