Kolkata Knight Riders vs Rajasthan Royals: కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. మంగళవారం (ఏప్రిల్16) రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టును 2 వికెట్ల తేడాతో ఓడించింది రాజస్థాన్ రాయల్స్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. సునీల్ నరైన్ శతకంలో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జోస్ బట్లర్ మెరుపు సెంచరీ (60 బంతుల్లో 107 నాటౌట్, 9ఫోర్లు, 6 సిక్సర్లు) చేయడంతో పాటు చివరి వరకు క్రీజులో ఉండి తన జట్టును గెలిపించాడు. రియాన్ పరాగ్ ( 14 బంతుల్లో 34), పావెల్ (26; 13 బంతుల్లో) దూకుడుగా ఆడి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, వరుణ్ 2, నరైన్ 2, వైభవ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది.
An Impactful Innings 😍
🔝 class effort from a 🔝 player ft. Jos Buttler
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z
— IndianPremierLeague (@IPL) April 16, 2024
కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, ఆంగ్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్.
జోస్ బట్లర్, కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, నాంద్రే బర్గర్
𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉
He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp
— JioCinema (@JioCinema) April 16, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..