Gautam Gambhir: గంభీర్ శాలరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. లంకలో 16 రోజులకు ఎంత తీసుకోనున్నాడంటే?

గౌతమ్ గంభీర్ బీసీసీఐ నుంచి ఎంత డబ్బు తీసుకున్నాడనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. టీమిండియా ప్రధాన కోచ్‌గా చేరేందుకు అతను ఎంత మొత్తంలో జీతం తీసుకుంటున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఎలాంటి ప్యాకేజీ ఉంటుందో ఎట్టకేలకు తెలిసింది. బయటికి వస్తోన్న నివేదికల మేరకు గౌతమ్ గంభీర్‌పై చేసిన ఖర్చు తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.

Gautam Gambhir: గంభీర్ శాలరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. లంకలో 16 రోజులకు ఎంత తీసుకోనున్నాడంటే?
Gautam Gambhir
Follow us

|

Updated on: Jul 24, 2024 | 1:01 PM

టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. శ్రీలంక పర్యటనతో అతని పని మొదలైంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇదే తొలి విదేశీ పర్యటన. వీటన్నింటికీ గౌతమ్ గంభీర్ బీసీసీఐ నుంచి ఎంత డబ్బు తీసుకున్నాడనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. టీమిండియా ప్రధాన కోచ్‌గా చేరేందుకు అతను ఎంత మొత్తంలో జీతం తీసుకుంటున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఎలాంటి ప్యాకేజీ ఉంటుందో ఎట్టకేలకు తెలిసింది. బయటికి వస్తోన్న నివేదికల మేరకు గౌతమ్ గంభీర్‌పై చేసిన ఖర్చు తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.

గౌతం గంభీర్‌కు ఎంత జీతం వస్తుంది?

బీసీసీఐ నుంచి గౌతం గంభీర్ అందుకోనున్న వార్షిక వేతనం రూ.12 కోట్లు. అంటే, గంభీర్ సంవత్సరానికి రూ. 12 కోట్లు అందుకోనున్నాడు. అంటే ప్రతి నెలా రూ. 1 కోటి గౌతమ్ గంభీర్‌ శాలరీగా తీసుకుంటున్నాడు.

ఇక శ్రీలంకకు 16 రోజుల పర్యటన కోసం ఎంత డబ్బు పొందనున్నాడు?

నివేదికల ప్రకారం, గౌతమ్ గంభీర్ వార్షిక వేతనం రూ. 12 కోట్లు మాత్రమే కాకుండా, అతనికి ఇతర సౌకర్యాలు కూడా ఇవ్వనున్నారు. ఇటువంటి సౌకర్యాలలో ముఖ్యమైనది విదేశీ పర్యటనలలో పొందే రోజువారీ భత్యం. ఈ మొత్తం రూ. 21000లుగా ఉంటుంది. గౌతమ్ గంభీర్ జులై 22న భారత జట్టుతో కలిసి శ్రీలంక చేరుకున్నాడు. ఆగస్టు 7 వరకు అక్కడే ఉంటాడు. దీని ప్రకారం శ్రీలంక టూర్‌లో గౌతమ్ గంభీర్‌కు 16 రోజుల మొత్తం అలవెన్స్ రూ.3,36,000లు అందుకోనున్నాడు.

గంభీర్‌కి కూడా ఈ రెండు సౌకర్యాలు..

గౌతమ్ గంభీర్ జీతం, అలవెన్సులు కాకుండా మరో రెండు సౌకర్యాలు పొందనున్నారు. వీటిలో ఒకటి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, మరొకటి ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసే ఏర్పాటు. ప్రస్తుతం, గంభీర్ శ్రీలంకలో ఈ సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తున్నాడు. అక్కడ గంభీర్ కోచింగ్‌లో టీమ్ ఇండియా వైట్ బాల్ సిరీస్ ఆడబోతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..