IPL 2025 భిన్నంగా కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అభిమానిగా, మీరు మీ టీంను కూడా మార్చవలసి రావొచ్చు. ఎందుకంటే, వచ్చే సీజన్‌లో భారీ మార్పులు రానున్నాయి.
మీ ఇష్టమైన ఆటగాళ్ళు వారి పాత జట్టుకు బదులుగా కొత్త జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యారు. వారితో పాటు మీ ఇష్టమైన జట్టు కూడా మారవచ్చు. ఇలాంటి షాక్‌లు ఎన్నో ఉన్నాయి.
ఐపీఎల్ 2025కి ముందు చాలా మంది స్టార్ ప్లేయర్‌లు తమ జట్టును మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, కొత్త కెప్టెన్‌తో వచ్చే సీజన్‌లో 4 జట్లు ప్రవేశించవచ్చని కూడా చెబుతున్నారు.
మీడియా కథనాల ప్రకారం, రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలి CSKలో చేరే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైందని అంటున్నారు.
రిషభ్ పంత్ ఢిల్లీని విడిచిపెడితే, ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా మారవచ్చు. DCలో భాగమవ్వనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
సూర్యకుమార్‌తో పాటు రోహిత్, బుమ్రా కూడా MI నుంచి నిష్క్రమించవచ్చు. రోహిత్ కూడా డీసీ లేదా జీటీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం బుమ్రా టీమ్ గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఎల్‌ఎస్‌జీకి చెందిన కేఎల్ రాహుల్ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా మారడంపై చర్చలు జరుగుతున్నాయి. గుజరాజ్ టైటాన్స్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.
ఐపీఎల్ 2025కు ముందు మినీ వేలం జరగనుంది. డిసెంబర్‌లో మెగా వేలం నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, ఫ్రాంచైజీల బడ్జెట్ కూడా భారీగా పెంచనున్నారు.