సచిన్, కోహ్లీ, ధోనిలకు సాధ్యంకాలే.. 10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!

Player ODI Debut Century: వన్డేల్లో అరంగేట్రంలోనే శతకం బాది పదేళ్లు గడిచినా చెక్కుచెదరని రికార్డుతో కేఎల్ రాహుల్ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. రాబోయే రోజుల్లో ఏ యంగ్ క్రికెటర్ అయినా ఈ రికార్డును సమం చేస్తాడో లేదో వేచి చూడాలి.

సచిన్, కోహ్లీ, ధోనిలకు సాధ్యంకాలే.. 10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
Team India Player Odi Debut Century

Updated on: Aug 10, 2026 | 12:02 PM

ODI Debut Century: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డు దాదాపు పదేళ్లుగా చెక్కుచెదరకుండా నిలిచింది. వన్డే క్రికెట్ అరంగేట్రంలోనే శతకం బాదిన ఏకైక భారతీయ బ్యాటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికీ ఏ ఇతర భారత ఆటగాడు ఈ రికార్డును అందుకోలేకపోవడం విశేషం.

అరంగేట్రంలోనే అద్భుత శతకం.. చరిత్ర సృష్టించిన రాహుల్..

భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజ బ్యాటర్లు వచ్చారు. సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి హేమాహేమీలు వన్డే క్రికెట్‌లో వేలాది పరుగులు సాధించి ఎన్నో రికార్డులు తిరగరాశారు. అయితే, తమ తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ సాధించే అరుదైన ఘనత మాత్రం వారిలో ఏ ఒక్కరికీ సాధ్యపడలేదు. ఆ అసాధ్యమైన ఘనతను సుసాధ్యం చేస్తూ కర్నాటక ఆటగాడు కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర లిఖించాడు.

ఎక్కువమంది చదివింది:  Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

ఇవి కూడా చదవండి

జింబాబ్వే పర్యటనలో మొదలైన పరుగుల ప్రవాహం..

2016 జూన్ 11న హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా కేఎల్ రాహుల్ అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. ఆ అరంగేట్ర పోరులోనే ఏమాత్రం తడబాటు లేకుండా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 115 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు చరిత్రలోనే తొలి వన్డేలోనే సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రకెక్కి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

పదేళ్లు గడిచినా చెక్కుచెదరని అరుదైన రికార్డు..

ఆ ఘనత సాధించి దాదాపు పదేళ్లు కావోస్తున్నా, ఇప్పటివరకు ఏ ఒక్క భారతీయ క్రికెటర్ కూడా ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది యంగ్ స్టార్స్ వన్డేల్లోకి అరంగేట్రం చేసినప్పటికీ, తొలి మ్యాచ్‌లోనే మూడంకెల స్కోరు సాధించే అద్భుతాన్ని పునరావృతం చేయలేకపోయారు. ఆల్‌టైమ్ దిగ్గజాల వల్ల కూడా సాధ్యంకాని ఈ ప్రత్యేక రికార్డు కేఎల్ రాహుల్ పేరు మీదే పదిలంగా ఉండిపోవడం విశేషం.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

జట్టులో కీలక ఆటగాడిగా కేఎల్ రాహుల్ ప్రస్థానం..

తొలి మ్యాచ్‌లోనే తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన రాహుల్, ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా జట్టు అవసరాలకు తగినట్లుగా వివిధ పాత్రల్లో ఒదిగిపోయి తన సత్తా చాటుకున్నాడు. గాయాలు, ఫామ్ లేమితో కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ, తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టులో నిలకడైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us