AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jonty Rhodes: సీఎం చంద్రబాబుతో క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ భేటీ.. ఏపీలో రూ.55 కోట్ల పెట్టుబడి..!

Jonty Rhodes: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి భాగస్వామి కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఆయన.. భోగాపురం సమీపంలోని ముక్కం బీచ్‌లో రూ.55 కోట్ల పెట్టుబడితో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు జాంటీ రోడ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.

Jonty Rhodes: సీఎం చంద్రబాబుతో క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ భేటీ.. ఏపీలో రూ.55 కోట్ల పెట్టుబడి..!
Jonty Rhodes Chandrababu Meeting
Venkata Chari
|

Updated on: Nov 13, 2026 | 6:52 AM

Share

Jonty Rhodes: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ (Jonty Rhodes) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరైన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (N Chandrababu Naidu) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం సమీపంలోని ముక్కం బీచ్‌లో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారు.

రూ.55 కోట్లతో వెల్‌నెస్ సెంటర్..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ముక్కం బీచ్‌లో రూ.55 కోట్ల పెట్టుబడితో కోస్టల్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ముక్కం కోస్టల్ వెల్‌నెస్, సర్ఫ్ క్లబ్ (Mukkam Coastal Wellness and Surf Club) ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాంటీ రోడ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వంతో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది.

పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణ..

సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. వెల్‌నెస్ కార్యకలాపాలతో పాటు సర్ఫింగ్ వంటి సముద్ర ఆధారిత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో ముక్కం బీచ్ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ఇలాంటి ప్రాజెక్టులు దోహదపడతాయి.

జాంటీ రోడ్స్ రాకతో ప్రత్యేక గుర్తింపు..

క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జాంటీ రోడ్స్‌కు అంతర్జాతీయంగా మంచి పేరు ఉంది. అలాంటి ప్రముఖ క్రికెటర్ ఏపీలో పర్యాటక ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో ముక్కం బీచ్‌లో ప్రతిపాదించిన రూ.55 కోట్ల ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us