AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: 6,6,6,6,6,6.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! రూ. 30 లక్షలకే ముచ్చెమటలు పట్టించావ్‌గా

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఆణిముత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. సన్‌రైజర్స్ జట్టు అనికేత్ వర్మను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.

IPL 2025: 6,6,6,6,6,6.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! రూ. 30 లక్షలకే ముచ్చెమటలు పట్టించావ్‌గా
Ipl 2025
Ravi Kiran
|

Updated on: Mar 31, 2025 | 12:38 PM

Share

యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఐపీఎల్. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ ప్లేయర్స్‌కి ఊతం ఇస్తోంది. గతేడాది హైదరాబాద్ జట్టు ద్వారా నితీష్ కుమార్ రెడ్డి లైమ్ లైట్‌లోకి రాగా.. ఇప్పుడు అనికేత్ వర్మ SRHకి ట్రంప్ కార్డుగా మారాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు నిండిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అనికేత్ వర్మ.. తాను ఆడిన మూడో మ్యాచ్‌లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు.

మార్చి 30న ఆదివారం విశాఖపట్నంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. కేవలం 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును.. 23 ఏళ్ల అనికేత్ వర్మ ముందుంది నడిపించాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.

అనికేత్ అద్భుతమైన అర్ధ సెంచరీ..

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అనికేత్ వర్మ 36 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఢిల్లీపై అతడు కేవలం 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇది ఐపీఎల్‌లో అనికేత్ తొలి అర్ధ సెంచరీ. తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. అక్షర్ పటేల్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే 16వ ఓవర్లో మెక్‌గర్క్ అద్భుతమైన క్యాచ్ తీసుకొని అనికేత్‌ను పెవిలియన్ పంపాడు. అనికేత్ మొత్తంగా 41 బంతులు ఎదుర్కుని 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసు.. AI చాట్‌బాట్‌తో క్రైమ్ స్కెచ్!
బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసు.. AI చాట్‌బాట్‌తో క్రైమ్ స్కెచ్!
ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ అక్కడ పెడితే మీ సమస్య..
ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ అక్కడ పెడితే మీ సమస్య..
మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..
మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!