IPL 2024: మరికాసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్.. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ

|

May 22, 2024 | 4:38 PM

IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భద్రతకు పెను ముప్పు ...

IPL 2024: మరికాసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్.. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ
Virat Kohli
Follow us on

IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భద్రతకు పెను ముప్పు ఉందన్న వార్తలు అభిమానులను అందోళనకు గురి చేస్తున్నాయి. కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు RCB ప్రాక్టీస్‌ను కూడా రద్దు చేసింది. విలేకరుల సమావేశం కూడా నిర్వహించలేదు. కీలకమైన మ్యాచ్‌కు ముందు ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయం ర్య RCB అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆర్‌సీబీ, రాజస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ కోసం ఇరు జట్లు సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నాయి. గత శనివారం చెన్నైతో RCB తన చివరి లీగ్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఆది, సోమవారాల్లో జట్టుకు విశ్రాంతి లభించింది. అయినప్పటికీ, అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత, RCB ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసింది. బెంగాలీ దినపత్రిక ఆనంద్‌బజార్ వార్తాపత్రిక గుజరాత్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ విరాట్ కోహ్లీ భద్రత కారణంగా RCB తన ప్రాక్టీస్‌ను రద్దు చేసిందని, ఇరు జట్లు విలేకరుల సమావేశం నిర్వహించలేదని పేర్కొంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో నలుగురు సాయుధ వ్యక్తులను గుజరాత్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. నలుగురు నిందితుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వారి నుంచి ఆయుధాలు, అనుమానాస్పద వీడియోలు, మెసేజ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో RCB టెన్షన్‌లో ఉంది. దీని కారణంగా విరాట్ కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని RCB ప్రాక్టీస్‌ను రద్దు చేసింది. అయితే ఈ ఘటన తర్వాత కూడా రాజస్థాన్ జట్టు మైదానంలో ప్రాక్టీస్ చేసింది. మరోవైపు ఇరు జట్లు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌ను ఎందుకు రద్దు చేశారనే దానిపై RCB ఫ్రాంచైజీ నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ, విరాట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాక్టీస్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..