యశస్వి, జోస్ బట్లర్, సంజూశామ్సన్, హెట్మయిర్, పడికల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్.. ఇలా అదరగొట్టే బ్యాటర్ల ఉన్నప్పటికీ 155 పరుగులను ఛేదించలేకపోయింది రాజస్థాన్. వీరి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంది. అయినా రాజస్థాన్ సొంత మైదానంలో ఓటమిపాలైంది. జైపూర్‌లో నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ జరగడం గమనార్హం. అయితే సొంత ప్రేక్షకుల మధ్య గుజరాత్ చేతిలో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది సంజూ టీం. 155 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ ( 35 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (41 బంతుల్లో 40) మినహా మరెవరూ పెద్దగా రాణించలేదు. అందరూ అలా వచ్చి ఇలా వెనుదిరిగారు. ఇక ‘ఆట తక్కువ.. ఆటిట్యూడ్ ఎక్కువ’ అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న రియాన్ పరాగ్ 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో మరోసారి ట్రోలర్లకు టార్గెట్‌గా మారిపోయాడు. రాబిన్ ఊతప్ప, రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు కూడా రియన్ ఆటతీరు మార్చుకోవాలంటూ సలహాలిస్తున్నారు.
కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు పరాగ్ 6 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 54 పరుగులు మాత్రమే చేయగలిగాడు. లక్నోపై 12 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు 5 మ్యాచ్‌లలో అతని స్కోర్లు 15, 5, 7, 20, 7 మాత్రమే. దీంతో పరాగ్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2019 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రియాన్ పరాగ్.. తన కెరీర్ లో ఇప్పటి వరకు 51 మ్యాచ్ లు ఆడి 561 పరుగులు చేశాడు. కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇక గతేడాది జరిగిన ఐపీఎల్ సందర్భంగా పరాగ్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. అందుకే ఇతడిని బిల్డప్ బాబాయ్ అంటూ నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. జట్టులో అనవసరంగా ఉంచుతున్నారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
2019- He is a Kid and he’s learning.
2020- He is a Kid and he’s learning.
2021- He is a Kid and he’s learning.
2022- He is a Kid and he’s learning.
2023- He is a Kid and he’s learning
2040- He is a Kid and he’s still learning.
Lord Riyan Parag pic.twitter.com/WnunyQ0dpZ— StrawHat Luffy (@PirateKing200) April 16, 2023
Buzz :- Riyan Parag is all set to join with Cheer Girls for the rest of the IPL ?? pic.twitter.com/jf0mahG7iR
— AngryMan (@HonesttCricFan) April 16, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..